దొరల వడ్డీ వ్యాపారము
181
యములు చేసినవాడు తప్పించుకొనిపోయెను గాని భారతదేశ స్థితిగతులు మాత్రము ప్రపంచమున కొకమారు వెల్లడి యయ్యెను. ఇంక కొన్నాళ్ళవరకిట్టి ఘోరములుచేయుట కెవ్వరు సాహసింపలేకపోయిరి. వారన్ హేస్టింగ్సు తరువాత భారతదేశగవర్నరు జనరలు పదవిని స్వీకరించుటకును చాల మంది భయపడిరి. అయినను మానవ స్వభావము చిత్రమైనది. కొలది కాలములోనే ఈవారన్ హేస్టింగ్సు చేసిన ఘోరాన్యాయములనుగూర్చి ఆంగ్లప్రజలు మరచిపోయి ఇతడు సామ్రాజ్య నిర్మాతయని గౌరవింపసాగిరి. చరిత్రకారులు చాలమంది మొదట వారన్ హేస్టింగ్సును విమర్శించినను సామ్రాజ్య తత్వాభిమానులగు వారు క్రమక్రమముగా నతని దుశ్చర్యలకు వెల్లవేసి వానిని కప్పిపుచ్చసాగిరి. తుదకు విన్సెంటుస్మిత్తు అతనిని పూర్తిగా సమర్థించి అతడు గవర్నరు జనరలులలో కెల్ల గొప్పవాడని పొగడినాడు.
నాలుగవ ప్రకరణము
దొరల వడ్డీ వ్యాపారము
I
భారతదేశమున నాంగ్లేయులు పన్నిన రాజ్యతంత్రపు వలలో నీ దేశరాజులను నవాబులను పడవేసియుంచి యుద్దములకని సైనిక పోషణకని ఇంక నితిరఖర్చులకని తఫిరీకులకని సొమ్ముకొరకు పీడించి నయమునను భయమునను అమిత ధనము లాగుచుండిరి. కంపెనీవారి ఆంగ్లేయోద్యోగులును తమ అధికారమును వీలువెంబడి నుపయోగించి అనేక మాయో