పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/194

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

170

బ్రిటిష్ రాజ్యతంత్రయుగము


స్పష్టముగా వ్రాసిరి. ఈవిదేశీయులనుగూడ కొంతవరకు పెట్టుబళ్ళు పెట్టుకొని వ్యాపారము చేసికొననీయవలెననియు లేనిచో వారికివచ్చుచున్న నష్టములవలన ఫ్రెంచివారితో కలహము రాకతప్పదనియు వ్రాసిరి." (చూడు: 9 వ రిపోర్టు; బర్కుగారి సంపూర్ణరచనలు. 3 వ వాల్యూము.)

1770 లో ఘోరమైనక్షామమువచ్చి వంగరాష్ట్రమును నాశనముచేసిననుగూడ కనికరములేకుండ కంపెనీవారి పెట్టుబడిపైన రావలసిన లాభము ఏదోవిధముగా వసూలు చేయబడెను. ఈవసూలు మొత్తము క్రమక్రమముగా హెచ్చింపబడుచుండెను. మొదటి రోజులలో చేసిన కొన్ని ఋణములు తీర్చబడి, కంట్రాక్టరులకు పారిశ్రామికులకు బయానాలివ్వబడుచు భూముల రివిన్యూ ఆదాయము సొమ్ముతోను, ఐరోపాదేశపు సరకుల విలువ సొమ్ముతోను, యిజారాల ఫలితపు సొమ్ముతోను, 1776 - 1780 మధ్య వంగరాష్ట్రమున కొని తీసుకుని వెళ్ళిన సరకుల విలువ పదిలక్షల పౌనులకన్న తక్కువగాకుండా నుండెను ! ఈ పదిలక్షల పౌనులకు భారత దేశమున కేప్రతిఫలమునులేదు. ప్రపంచములోని అన్ని దేశముల ఆదాయము వ్యాపారమువలననే వచ్చుచుండగా నీ దేశములో వ్యాపార లాభము రెవిన్యూవలన రాబట్టబడుచుండెను! ఆనాటి దుష్పరిపాలనను గూర్చి మెకాలే యిట్లువర్ణించినాడు. "మూడుకోట్ల మానవులు ఘోరదుస్థితిలో మునిగిపోయిరి. వీరు నిరంకుశ రాజుల పరిపాలనక్రింద నుండుట కలవాటుపడినవారేగాని యిట్టి నిరంకుశ ఘోరపరిపాలన మెన్నడును వీరెరుగరు. పూర్వపు