పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/193

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

క్లైవు చూపినదారి

169

ఇట్లు 1765 – 1771 మధ్య కంపెనీవారి సివిలు మిలిటరీ ఖర్చులన్నియుపోను ఇంగ్లాండుకంపెనీ శిస్తు ఆదాయము బాపతు సొమ్ము 40 లక్షలపౌను (4కోట్ల రూపాయ)లుండెను. అసలు వసూలుచేసిన సొమ్ము 130 లక్షల పౌనులు. (11 కోట్ల ముప్పదిలక్షల రూపాయలు)

పైనజెప్పిన సివిలు మిలిటరీ ఖర్చులుగూడ జీతముల రూపముగానేమి, ఇతర రూపముగానేమి ఇంగ్లాండునకే తరలినవి.

తూర్చుఇండియా కంపెనీ వ్యవహారములనుగూర్చి విచారణచేయుటకు పార్లమెంటు కామన్సుసభవా రేర్పరచిన కమిటీ నివేదికలో ధర్మాత్ముడగు బర్కుగారు ఈ అన్యాయముల నెల్ల బహిరంగపరచియున్నాడు. ప్రజలవలన శిస్తు వసూలుచేయు అధికారమును పురస్కరించుకొని చేయబడు యీ క్రొత్తరకపు వ్యాపారము పద్ధతి యొక్క సహజమైన అనర్థకములు త్వరలోనే కనబడసాగెను. వంగరాష్ట్రములోని నేటివులు (భారతీయులు)ను అచ్చట వ్యాపారము చేయు విదేశీయులునుగూడ ఈ యన్యాయములనుగూర్చి మొరపెట్టసాగిరి. దేశముయొక్క వ్యాపార విధానము నంతటికి నిది వేరుపురుగయ్యెను. నేటివుల బాధలు మాన్పుట కెవ్వరును ప్రయత్నింపలేదు. దీనివలన విదేశీయులకు కలుగు చుండిన నష్టము విషయములోమాత్రము వారితో కొన్ని ఏర్పాటులు చేసికొనుట యవసరమని వంగరాష్ట్ర రాజధానిలోని కంపెనీ యధికారులు సీమలోని కంపెనీ డైరెక్టర్లకు