పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/191

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

క్లైవు చూపినదారి

167

క్లైవు వెళ్ళిపోయిన పిదప నైదు సంవత్సరములలో కంపెనీయుద్యోగు లెప్పటివలెనే యన్యాయ విత్తసమార్జనము చేయుచునే యుండిరి. ప్రజలను వంగరాష్ట్ర నవాబును పీడించి పీకికొని తినుచుండిరి. ప్రాతపద్ధతులతోనే స్వంతవ్యాపారము చేయుచు ప్రజలను బాధించుచుండిరి. ఆనాటి ఘోరపరిస్థితులనుగూర్చి కంపెనీ యుద్యోగియగు విలియం బోల్‌ట్సు అనునతడు 1772 లో తన గ్రంథములో వర్ణించియున్నాడు. [1]అతడు వర్ణించిన సంగతులు నిజములేయని ప్రొఫెసర్ మ్యూర్ అంగీకరించియున్నాడు. దేశీయపారిశ్రామికులపైనను పనివారిపైనను వర్ణనాతీతములగు క్రూరకృత్యములు చేయబడు చుండెను. వీరు కంపెనీవారికి కేవలము బానిసలుగా చేయబడిరి. కంపెనీఏజంట్లు గుమాస్తాలు వీరిని చిత్రహింసలకు పాల్పరచి పీడించుచుండిరి. జుల్మానాలువిధించుట, కొట్టుట, బలవంతముగా ముచ్చిలకాలు వ్రాయించుట, ఖైదుచేసి నిర్బంధించుట, మున్నగు క్రూర కృత్యములవలన నేతగాండ్రు, వృత్తులు మానుకొని పోయిరి. వస్తువుల ఉత్పత్తి క్షీణించినది. సరకులే కరవులైనవి. ఆదాయము తగ్గినది. కంపెనీవారి యిజారాను పురస్కరించుకొని పెద్దయధికారులు కంపెనీవారికి తమకు తమ వారికి వీలైనంత లాభకరముగా నీ వ్యాపారము జరుపుచున్నారు. ఈ అన్యాయములు బయల్పరుపబడకుండా నోళ్లను

  1. Considerations on Indian affairs-William Bolts.. The making of British India. -Muir.