162
బ్రిటిష్ రాజ్యతంత్రయుగము
III
క్లైవుయొక్క రెండవపరిపాలననాటి స్థితి
ఆంగ్లేయ వర్తక కంపెనీ నౌకరులు భారతదేశమున జరుపుచున్న ఘోరఅన్యాయములు మితిమీరగా నింగ్లాండుకు ఫిర్యాదులు కొల్లలుగా పంపబడగా, ఎట్టకేలకు కంపెనీ డైరక్టర్లు మేల్కాంచి అప్పటికి చాలసొమ్ము గడించుకొని హాయిగా కూర్చుండిన క్లైవును మరల నిండియాకుపోయి ఆ దురాచారములను మాన్పు మని కోరిరి. నవాబులతో పూర్వము చేసికొనిన సంధిషరతులకును తరువాత నీతనితో బలవంతముగా చేసికొనినసంధికిని గూడ భంగకరముగా తమ యుద్యోగులు స్వంతవ్యాపారము జేసికొనుట యన్యాయమని యీ డైరక్టర్లకుకూడా తోచినది. ఆనాడు వంగరాష్ట్రమున జరుగుచుండిన అన్యాయములు క్లైవుకుకూడా రోత కలిగించునంత ఘోరముగనుండెను. అతడు వ్రాసినలేఖలనుబట్టి యిది బయల్పడినది. ఒక్క వంగరాష్ట్రమునతప్ప యిక నే యితర దేశములోకూడ ఇట్టి అరాజకము, కల్లోలము, లంచగొండి తనము, క్రుళ్ళు, బలాత్కారఅపహరణము కనివిని యెఱుగము. ఇంత దౌర్జన్యముగను, దోపిడిగను, ఇంతమంది యింతటినంపద లార్జించుకొనుటయు నెక్కడను జరుగలేదు. వంగరాష్ట్రము, బీహారు, ఒరిస్సాలవలన సాలుకు 30 లక్షల పౌనులు నికరాదాయము (3 కోట్ల రూపాయలు) వచ్చుచుండెను.
ఈ సుబాను మీర్జాఫరుకు మరల నిచ్చినప్పటినుండి యీ రాజ్యము కంపెనీవారి మేనేజిమెంటుక్రిందనే యుండెను. .