158
బ్రిటిష్ రాజ్యతంత్రయుగము
వారిని హింసించి బాధింతురు. ఇక కొనుటలో తమ కిచ్చవచ్చిన ధర కత డివ్వవలెను. అమ్ముటలోను అంతే. ఒక్కొక్కప్పు డేమియు నివ్వరు. నేను మందలించినచో పై యధికారులకు ఫిర్యాదుచేయుదురు. ప్రతిదినమునిట్టి ప్రజాపీడనమును వంగరాష్ట్ర గుమాస్తాలుచేయుచున్నారు. ఈబాధలుపడలేక ఈజిల్లా ( బేకర్ గంజి)లోనిజనులు లేచిపోవుచున్నారు. పూర్వము వస్తువులతో కలకలలాడు బజారు లిప్పుడు ఖాళీగానుండుట తటస్థించుచున్నది. ఈ గుమాస్తాల బంట్రోతులు ప్రజలను బలవంతపెట్టుట యధికముగానున్నది. జమీందారుదీనిని నివారించుటకు ప్రయత్నించినచో అతనినిగూడా దండించెదమని బెదరించుచున్నారు.
పూర్వము న్యాయవిచారణ బహిరంగముగా కచేరీలో జరుగుచుండెను. ఇప్పుడు ప్రతిగుమాస్తాయు ఒక న్యాయాధిపతియై అతనిబసయే ఒక కచేరీగానున్నది. వీరు జమీందారులకుకూడా శిక్షలు విధించుచున్నారు. తమ జవానులతో కలహించిరనియు లేదా ఏదో దొంగిలించిరనియు లేనిపోని నేరములుకల్పించి నష్టపరిహారముక్రింద వారిదగ్గఱనుండి సొమ్ము లాగుచున్నారు." (India under Early British Rule-R.C. Dutt)
విలియంబోల్‌ట్సు అనునొక ఆంగ్లేయవర్తకు డానాటి పరిస్థితు లింకను చిత్రముగా వర్ణించినాడు. “కంపెనీవారి నాటు వ్యాపారపద్ధతిచాలా అన్యాయముగానున్నది. ప్రతినేతగాడును పారిశ్రామికుడును దీనివలన బాధల నందుచున్నాడు. ప్రతి వస్తువుకు ఇజారా లేర్పరుపబడి ఎంతెంత సరకు ఏ పారిశ్రా