156
బ్రిటిష్ రాజ్యతంత్రయుగము
గవర్నరు వెరెల్‌ష్టు ఈక్రిందిసంగతి బయలుపరచి యున్నాడు. 'సుంకములు చెల్లించకుండా రహస్యవ్యాపారము చాల జరుగుచుండెను దీనిలో చాల క్రూరకృత్యములు గూడా చేయబడుచుండెను. ఇంగ్లీషు ఏజెంట్లు గుమాస్తాలును ప్రజలను పీడించుటయే గాక తమ కాటంకము కలిగించిన నవాబుయొక్క అధికారులను ధిక్కరించుచు వారిని కట్టికొట్టుట గూడా చేయుచుండిరి. ఇదియే మీర్ఖాసీముతోడి యుద్ధమునకు ముఖ్య కారణము.'
ఈ సంగతులన్నియు సర్వసామాన్యముగ జరుగుచుండినట్లు అప్పుడు చిన్న అధికారిగానుండిన వారన్ హేస్టింగ్సునాటి గవర్నరుకు 25-4-1762 తేదీన వ్రాసిన లేఖవలనగూడా తెలియుచున్నది. కంపెనీవారి జెండాతో పోవు నౌకరులకు సుంకములు లేని యవకాశముజూచికొని కంపెనీ నౌకరులెల్లరు తమస్వంతవ్యాపారము చేయు ప్రతిపడవపైనను ఆంగ్లేయ జెండాల నెగురవేయించుచు మోసములు చేయుచు సుంకము లివ్వక తప్పించుకొను చుండిరి. తెల్లవారు వచ్చుచున్నారని తెలిసినచో వారి బాధలు పడలేక పారిశ్రామికులు వర్తకులు పారిపోవుచుండిరి. అందువలన నాంగ్లేయులపైన ప్రజల కసహ్య భావముకూడా కలుగుచుండెనని వారన్ హేస్టింగ్సు తన లేఖలో వ్రాసెను.(India under Early British Rule-R. C. Dutt)
ఈ అన్యాయములనుగూర్చి వంగరాష్ట్రనవాబుమిర్ఖాసీం ఫిర్యాదుచేసెను. “ఉప్పు, పోకచెక్కలు, నెయ్యి, బియ్యము, గడ్డి, వెదుళ్లు, చేపలు, గోనెలు, అల్లము, పంచదార, పొగాకు,