పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/177

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

క్లైవు చూపినదారి

153


యాశ్చర్యముగానున్నదని క్లైవు తన చర్యలు సమర్ధించుకొనెను! ప్రపంచములో మానవులకెల్లరకును పరమధర్మ ప్రమాణములుగ నుండవలసిన నీతి నియమములను ప్రభుత్వములు గమనింపవలసిన న్యాయ ధర్మములనుగూడ మీరి, క్లైవు ఘోరమైన నేరములు జేసినాడని ఇతని జీవితమువ్రాసిన మెకాలే యంగీకరించినాడు. క్లైవు 1774 లో ఆత్మహత్య జేసికొనెను.

మీర్జాఫరును సింహాసన మెక్కించినప్పుడు చేసినసంధి సమయమున బహిరంగముగా కంపెనీవారి కీతడిచ్చిన 1750000 పౌనులు రొక్కమును విశాల భూభాగమునుగాక సంధిపత్రమున నుదాహరింపకపోయినను అతడు కంపెనీ యుద్యోగు లందరికిని విశేషధనమును బహుమతులరూపముగా లంచమిచ్చెను. 1772 లో సెలెక్టుకమిటీవారే ఈ బహుమతుల విలువ 1250000 పౌనులుండునని అంచనా వేసియున్నారు. దీనిలో క్లైవు వాటా కొసగబడిన లంచములవిలువ 234000 పౌనులనియు నిర్ణయింపబడినది. ఇవి రుజువైన లంచములు; రుజువుకాని వెన్నికలవో ఎవ్వరునెరుగరు. 1765 లో క్లైవు మూడవసారి పరిపాలనాధికారము వహించి కలకత్తాకు వచ్చునప్పటికి(మీర్జాఫర్) జఫరాలీఖాను చనిపోయెను. క్లైవుతనకుమారునికుపకారముచేయగలడని తలచి మీర్జాఫర్ చనిపోవుచు క్లైవుకు 70 వేల నవరసులు చెందజేసెను. గాని అతని వారసుడు సింహాసన మెక్కుటకై కంపెనీకి లక్ష నవరసులు లంచమిచ్చుకొనవలసి వచ్చెను. ఈలోపుగా కొన్నాళ్ళు అయోధ్యవజీరుగానుండిన