148
బ్రిటిష్ రాజ్యతంత్రయుగము
బ్రయత్నించెను. అందువలన నతనికి విశేషధనము కావలసివచ్చెను. తనదేశ ప్రభుత్వమువారిని సొమ్ము అడుగగా వారైరోపాలో యుద్ధములందు మునిగి ఇతనికి సహాయముచేయలేక పోయిరి. ఆంగ్లేయులు ఫ్రెంచివారికన్న మూడురెట్లు హెచ్చు వ్యాపారము చేయుచు దానివలన విశేష ధనము నార్జించుచుండిరి. పైగా 1757 మొదలు బంగాళా దేశాదాయములెల్ల ఆంగ్లేయుల చేతులలోనుండి వారికిధనబలము చేకూరెను. ఫ్రెంచి వారితో నాంగ్లేయులకు యుద్ధములుతటస్థించిన సందర్భములో రాజ్యతంత్రనిపుణులగు ఆంగ్లేయులు వారిని ఐరోపాలోకన్న దూరప్రదేశములగు నిండియాలోను వలస రాజ్యములలోను యుద్దములం దోడింపవచ్చునని గ్రహించి తమ వర్తక కంపెనీలకు సైన్యములను సాయమంపి ఆ యుద్దములందు తోడ్పడుచు జయము గాంచుచుండిరి. ఫ్రెంచివా రిది గ్రహింపలేదు. ఐరోపాలోనే తమ శక్తులెల్ల కేంద్రీకరించి వలసరాజ్యము లందలి కంపెనీవారి కేసహాయమును జేయరైరి. ఆంగ్లేయకంపెనీ యుద్యోగులు అవకాశము దొరికినప్పుడెల్ల భారతదేశములోని ఫ్రెంచి కంపెనీపైకి దాడి వెడలుచుండిరి. అందుకొరకు స్వదేశనవాబులతోను రాజులతోను కుట్రలు చేయుచుండిరి. ఈ కుట్రలకును రాజ్యాక్రమణయుద్ధములకును ఆంగ్లేయాధికారులు మద్దతుచేయుచుండిరి. విజయముగాంచినవారికి బహుమతులిచ్చి సమ్మానముజేసి వారి శౌర్య ధైర్యములనుగూర్చి పొగడుచు "సీమకువ్రాసి ప్రోత్సహించుచుండిరి. సీమవారు సామాన్య సైనికుడగు క్లైవుకు బిరుదులిచ్చి పోత్సహించు