పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/171

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఇంగ్లీషు వర్తకసంఘము

147


రాజ్యతంత్రమున నిపుణుడై ఆంగ్లరాజ్య స్థాపనకు పునాదులు వేసెను.

దక్షిణాపథమున నిట్లు కేవలము వ్యాపారపు పోటీలయందు పెనగులాటతో ప్రారంభమైన పోరాటము దేశములో రాజకీయాధికారమును చేజిక్కించుకొని ఆధిపత్యము వహించుట కొరకు చేయబడు తీవ్రయుద్ధముగా పరిణమించి ఉత్తర హిందూస్థానమునకు ప్రాకెను. 1757 లో క్లైవు కుతంత్రముజేసి వంగరాష్ట్ర నవాబు సైన్యములను ప్లాసీయుద్ధములో నోడించుటతో ఆంగ్లరాజ్యస్థాపనకు పునాదులు వేయబడినట్లు చెప్పవచ్చును. ఈ విజయముతో క్లైవు ఢిల్లీ చక్రవర్తిని బుట్టలో వేసికొని మూడుపరగణాల దివానీగిరీని సంపాదించెను. దీనితో నీ దేశమున నాంగ్లేయ రాజ్యాధిపత్యమునకు దారి ఏర్పడెను.

IV

భారతదేశాక్రమణముచేయు తలంపు ఫ్రెంచి వర్తకకంపెనీ యుద్యోగులకే మొట్టమొదట కలిగినను తుద కారాజ్యధిపత్యము ఆంగ్లేయుల కంపెనీ కే దక్కినది. వీని కనేక కారణములుకలవు. ఆంగ్లేయులు మొదటినుండియు వర్తకమువలని లాభమును ధనార్జనమును తమ ప్రధానోద్దేశములుగా నుంచుకొని రాజ్యాక్రమణమునకు తమ చేతిసొమ్మును ఖర్చుచేయక సామదానభేదోపాయములతో మెల్లగా రాజ్యాధిపత్యము సంపాదించిరి. ఫ్రెంచి సేనానియగు డూప్లే యట్లుగాక వర్తక లాభమును లెక్క సేయక కేవలము తన బాహుబలపరాక్రమమువలన దిగ్విజయము చేసి ఒక్కసారిగా దేశాక్రమణ చేయ