పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/170

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

146

బ్రిటిష్ రాజ్యతంత్రయుగము


సైన్యమునల కెనరావనియు, భారతీయసైనికులను పాశ్చాత్య సైనికాధికారులే తర్ఫీదుచేసి నడిపినచో నట్టి క్రమశిక్షణ లేని, సైన్యము లెంతసంఖ్యాబలముగలట్టి వైనను నిలువజాలవనియు గ్రహించిన మేధావి యితడే. ఆంగ్లేయవర్తక శిఖామణు లింకను తమ వ్యాపారములో మునిగి తేలుచు రూపాయలు లెక్క పెట్టుకొనుచు గూర్చుండియుండగా నీ రాజ్యతంత్రజ్ఞుడు తన చాణక్య నీతిని ప్రయోగింపసాగెను.

ఔరంగజేబు చనిపోయినపిదప మొగలుచక్రవర్తులు బలహీనులైనందున వారి గవర్నరులుగానుండిన సుబేదారులు నవాబులు స్వతంత్రు లగుచుండిరి. చిన్న చిన్న నవాబులు రాజులు స్వతంత్రులై సింహాసనముల నాక్రమించుటకు పెనగులాడుచుండిరి. ఈ కల్లోలములో నైజాముదగ్గర పలుకుబడి సంపాదించి అతనికిలోబడిన కర్నాటక నవాబు సింహాసనమున నొక కీలుబొమ్మను నిలిపి ఇంగ్లీషువర్తకులను త్రోసిరాజనుటకు ఫ్రెంచి గవర్నరు డూప్లే తంత్రమును పన్నెను. సైన్యములను నడిపెను. ఐరోపాలోని యుద్ధము భారతదేశమునకు గూడ ప్రాకెను. ఫ్రెంచివర్తక సంఘమును ఇంగ్లీషువర్తక సంఘమును వ్యాపారముకొరకు దేశములోని రాజకీయములందు పాల్గొని ప్రతిపక్షములు వహించిన నవాబులకు సహాయము చేసి పోరాడసాగిరి. ఫ్రెంచివారికి డూప్లేదొరికినట్లే ఇంగ్లీషువారికి క్లైవు దొరకెను. ఇంగ్లాండులో నల్లరిచిల్లరిగా తిరుగుచుండిన క్లైవు ఇండియాకు సామాన్యగుమాస్తాగావచ్చి సైనికుడై సేనానియై గవర్నరుపదవిపొందెను. ఇతడు కుటిల