ఇంగ్లీషు వర్తకసంఘము
145
ఇతడు పొగరుబోతుగానుండి కంపెనీ డైరెక్టర్లను తూలనాడినాడు. ఇతనికి భయపడి కాబోలు 1697 లో నితనిని మద్రాసు ఫోర్టుసెంట్ జార్జికి గవర్నరుగా ఎన్నుకొనిరి. ఇతడు 12 సంవత్సరములు గవర్నరు పదవిలోనుండి అమిత ధనము నార్జించెను. ఇతడు గవర్నరుగా నుండగానే రీజెంటువజ్రమని ప్రసిద్ధిగాంచిన మణి నిండియానుండి సీమకు జేర్పించినాడు. ఫ్రెంచిదేశపు రీజెంటు కా వజ్రమును 135000 పౌనులకు విక్రయించి లాభముపొందినాడు. ఈ ధనముతో తన మనుమని గూడా పార్ల మెంటుసభ్యునిగా జేసినాడు.
III
రాజ్యతంత్ర ప్రారంభము
మొగలాయి సామ్రాజ్యవిభవపు దిబ్బలపైన పాశ్చాత్య సామ్రాజ్యపు పునాదులు వేయవచ్చుననియు అంతఃకలహములతో నిండియున్న ఈ విశాల దేశమును చేజిక్కించుకొని రాజకీయాధిపత్యమును సంపాదించి స్వప్రయోజనార్దము వినియోగించుకొన వచ్చుననియు మొట్టమొదట గ్రహించి పనిజేసిన అభినవచాణక్యుడు ఆనాడు భారత దేశమున వర్తకముజేయుటకు వచ్చిన పాశ్చాత్య వర్తక కంపెనీలలో ఫ్రెంచివారి గవర్నరగు డూప్లే. ఇతడు కుశాగ్రబుద్ధి. ఆనాటి రాజులు, నవాబులు విశేష ధనవ్యయము జేసి పోషించుచున్న అసంఖ్యాకములగు సైనికనిచయములకు క్రమ శిక్షణము లేదనియు, ఇట్టి సైన్యము లెన్నియైనను పాశ్చాత్యపద్ధతిని తర్ఫీదుపొందిన