పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/157

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బ్రిటిష్ రాజ్యతంత్రయుగము

133


డగా వీరి ముందువెనుకల పది పండ్రెండుగురు నల్ల సేవకులు వీరి బిరుదావళిని వర్ణించుచు కేకలువేయుచు పరుగిడుచుండిరి.

ఆరోజులలో ఆంగ్లేయుల జీవితవిధానము నేటికన్న నత్యధిక ధనవ్యయ కారణముగ నుండెను. ఆంగ్లేయులకు గావలసిన సీమసరకు లమిత ప్రియముగనుండెను. సారాయి బుడ్లు, దుస్తులు, నాటకముటిక్కెట్లు మొదలు ఇంటి అద్దెల వరకును నేటికన్న చాలా హెచ్చుసొమ్ము ఖర్చు చేయవలసి యండెను. ఆహారవిహారములకు వినోదములకు పెద్ద యుద్యోగులు చేయునట్లే చిన్న యుద్యోగుల స్త్రీలును ఇతర ఆంగ్లేయులుకూడా ఖర్చుచేయుట ప్రారంభించుచుండిరి. ఎంత ధనమైనను చాలకుండెను. ప్రజలను పీడించి పుచ్చుకున్న లంచములు చాలక అనేకమంది అప్పులపాలై ఋణదాతల చేతులలో నుండి వెలువడ లేక సీమకు పోవుటకుగూడ వీలులేకుండ నుండిరి. ఈ దుబారాతనమువలనను. దుర్వ్యసనములవలనను ఆంగ్లేయులలో అనేకులు దుర్మార్గములుచేయుచు తాము పాడగుటయే గాక ఇతరులనుగూడ పాడుచేయుచుండిరి.

III

ఈ దేశములోని వివిధజాతులవారిని, మతములవారిని, క్రైస్తవ మతమున గలుపుకొనుటకు మిషనరీలు విశ్వప్రయత్నములు చేయుచుండిరి. కంపెనీ ఉద్యోగులు వారి కిందు సహాయము చేయుచుండిరి. మిషనరీలు బలవంతముకూడా చేసినట్లు ఒత్తిడి చేసినట్లు నిదర్శనములుకలవు. శ్రీరాజా రామమోహనరాయలనుగూడా క్రైస్తవమతమున చేరుమని క్రైస్తవ