Jump to content

పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/156

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

132

భారత దేశమున


తెల్లవారెల్లరు సైనికులో లేదా అధికారులోయని ప్రజలు భయపడుచుండిన ఆ రోజులలో కంపెనీ పలుకుబడిని అధికారమును పురస్కరించుకొని నిరంకుశముగా ప్రవర్తించుటకు ప్రజలను భయపెట్టి సులభముగా లంచములు గైకొనుటకు వీరికి గల అమితమైన అవకాశములు, భార్యాబిడ్డలు గాని సంసారములుగాని లేకుండా ఈ దూరదేశములో చాల రోజులుండ వలసివచ్చుట, తమదేశ శీతోష్ణ స్థితికి భిన్నముగానుండు ఈ దేశపరిస్థితులును, ఈ యువకులను అతిత్వరితముగనే సుఖలోలురుగను సోమరిపోతులుగను జేసివైచుచుండెను. వీరిలోచాలమంది సురాపానమున వ్యభిచారమున మునిగియుండిరి. అనేకులు దేశీయవారకాంతల నుంచుకొనుచుండిరి.

వెలస్లీ గవర్నరుజనరలుగా నున్నప్పుడు కంపెనీవారి సివిలు సర్వీసు ఉద్యోగుల కొక పాఠశాల నేర్పరుప దలపగా కంపెనీ డైరెక్టర్లు మాన్పించిరి. అందువలన వీరిలో నెట్టి సంస్కారమును కలుగలేదు. ఈ ఉద్యోగులు చాలమంది లంచగొండెలై అమిత ధనము నార్జించి విచ్చలవిడిగా ఖర్చుపెట్టుచు తమ నేటివు ఉంపుడుకత్తెలకు పుట్టిన యూరేషియను పిల్లలతో సంసారసాగరము నీదుచు భారతీయుల కులాచారములను అలవాటు చేసికొనుచుండిరి.

తక్కిన ఆంగ్లేయులుకూడ వీరినిజూచి ఈక్రొత్త జీవితవిధానమున కలవాటుపడసాగిరి. ఏ బంగాళిబాబునో నవాబునో దబాయించియో వంచించియో ఎరువుతెచ్చుకొన్న గుఱ్ఱపుబండ్లలోను పల్లకులలోను ఈ ఆంగ్లేయు లూరేగుచుం