పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/150

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

126

భారత దేశమున


తెల్లవారికి అగౌరవకరముగా తోచెను. తమ్మతడవమానించు చున్నాడని కోపగించిరి.

ఆంగ్లేయకంపెనీ అధికారులును వారి తాబేదారులును మొదటి రోజులలో భారతదేశమున చక్రవర్తికిని నవాబులకును సాగిలబడి మ్రొక్కుచు ఎంతో భయభక్తులతో పూర్వపు మర్యాదలెల్ల పాటించుచుండిరి. జామరి౯ రాజుకు పాశ్చాత్యులు సాగిలబడి మ్రొక్కుటను, జహంగీరుకాలమున సర్ తామస్‌రో చేసిన జొహారులనుగూర్చిన చిత్తరువు లెన్నో కలవు. కంపెనీ డైరెక్టర్లు మొదలు గవర్నరువరకు తమ లేఖలందు చక్రవర్తియొక్కయు నవాబులయొక్కయు బిరుదావళిని వర్ణించి మర్యాద వాచకములను వ్రాయుచుండిరి. 1711 లోకలకత్తా విలియంకోట ప్రెసిడెంటు వంగరాష్ట్ర నవాబున కతివినయముగా దాసోహముజేసి “ఏలినవారి సేవకే అంకితము జేసిన నా ప్రాణములను తమపాదములకడ నుంచుచున్నానని వ్రాసెను. ఇతడే రెండేండ్లకు తరువాత పరుక్ షయ్యరు చక్రవర్తికి వ్రాయుచు, “ఏలినవారి సేవకుడును, అత్యల్పమైన ఇసుక రేణువును అగు తూర్చుఇండియా కంపెనీ ప్రెసిడెంటు జా౯రస్సెల్ తన నుదుటిని నేలపైన మోపిచేయు మనవి” అని వ్రాసి సాష్టాంగ ప్రణామముజేయుటను సూచించినాడు.

ఆరోజులలో నింగ్లీషువర్తకకంపెనీవారు మొగలుచక్రవర్తికిని ఆయనయొక్క రాజప్రతినిధులకును అడుగులకు మడుగులొత్తి అతివినయముగా ప్రవర్తించుచు వారి కనేక విధములగు బహుమతులు రొక్క నజరులు సమర్పించి వారిని తృప్తి