పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/149

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బ్రిటిష్ రాజ్యతంత్రయుగము

125


మాంగ్లేయ పరిపాలకోద్యోగులుకూడా కొబ్బెరకాయ కొట్టవలసి యుండిరి.

పూర్వము క్రొత్తగా వచ్చిన ఆంగ్లేయోద్యోగులు జిల్లాలోనుండు హిందూమహమ్మదీయ ప్రముఖుల నెల్లరను దర్శించి మర్యాదచేయుట ఆచారముగా నుండెను. ఆ పద్ధతి 1830 నాటికి పోయి మనవారే ఆంగ్లేయోద్యోగులను దర్శించి మర్యాదచేయు పద్ధతి ప్రారంభమయ్యెను. అంతేకాదు. వారి కాంగ్లేయోద్యోగులు దర్శనమిచ్చుటయే యొక గొప్ప గౌరవముగ పరిగణింప బడసాగెను. తెల్ల యధికారులను దర్శించుటకు పోవు హిందూమహమ్మదీయ పెద్దమనుష్యులు తమ మర్యాదను స్థితిగతులను గూర్చిన నిదర్శన పత్రములు తీసికొనిపోవలసి యుండిరి. తెల్లవారిలోకూడా నొక విధమగు జాత్యహంకారము, గర్వము ప్రారంభమైనది. ఎంత గొప్పవాడైనను భారతీయుని "నేటివు” అని నీచముగ పిలుచుటయు నీచముగ జూచుటయు మొదలిడిరి. భారతీయులకు తెల్లవారన్న భయమొకటికలుగసాగెను. తెల్లవారియెదుట కూర్చుండుటకు గూడ భారతీయులు సాహసింపలేకుండిరి. కలకత్తాలో ప్రతి యాంగ్లేయుడును తనకు ప్రతి భారతీయుడు సలాము చేయవలెనను భావము ప్రబలినది.

విలియంబెంటికు చాలా నిగర్వియై భారతీయులను తెల్లవారితో సమానముగా చూడసాగెను. తన భవనమున జేయు విందులకు సమ్మానములకు ఆంగ్లేయులతో పాటు భారతీయులు కూడా గుఱ్ఱపుబండ్లెక్కి రావచ్చునని శాసించెను. ఇది