పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/148

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

124

భారత దేశమున


ఈదేశములోని హిందూ మహమ్మదీయ జనసామాన్యముపట్ల గూడా చాలా మర్యాదతో ప్రవర్తించుచుండిరి. హిందూమహమ్మదీయాచార వ్యవహారముల యెడల నెంతో సహనబుద్ది చూపుచుండిరి. ఆంగ్లేయుల కీదేశమున పలుకుబడి హెచ్చి రాజ్యాధిపత్యము చేజిక్కి బలవంతులైనకొలదియు వీరి వైఖరిలో గొప్పమార్పుకలుగసాగెను. చక్రవర్తిని, నవాబులను రాజులను గౌరవించుటపోయి తృణీకరించుటయు, ప్రజలను మర్యాదచేయుట పోయి నీచముగ జూచుటయు ప్రారంభమయ్యెను. ఈ మార్పు చాలచిత్రమైన పరిణామము.

ఆంగ్లేయ వర్తక కంపెనీ పరిపాలనమున విలియంబెంటింకు గవర్నరు జనర లగు నాటికి అనగా 1828 నాటికిగూడ ఆంగ్లేయవర్తక కంపెనీ ప్రభుత్వాధికారులు పూర్వమర్యాదలు విడిచిపెట్టలేదు. పూర్వాచారములను పూర్తిగా తృణీకరించుట ప్రారంభింపలేదు. మత సహనము జూపుట కంపెనీవారి విధియని తలచి హిందూ మహమ్మదీయులు తమతమ మతాచారములను బట్టి జరుపు ఉత్సవములందు కంపెనీ వారి ఆంగ్లేయోద్యోగులు హాజరుగానుండు నట్లు ఉత్తర్వుజేసిరి. 1830 నాటికి హిందూమహమ్మదీయుల పండుగలకు ప్రభుత్వము సెలవులిచ్చు చుండెను. ఆనాటి కింకను ఆదివారములు సెలవులులేవు. ఆదివారము నాడుగూడ ప్రభుత్వ కార్యాలయములు పనిచేయు చుండెను. ఆనాటి కింకను న్యాయస్థానమున ఇంగ్లీషు భాష వాడుకలోలేదు. ఫారశీభాషయె వాడబడుచుండెను. వర్ష ఋతువు ప్రారంభ సమయమున పూర్వాచారము ప్రకార