బ్రిటిష్ రాజ్యతంత్రయుగము
123
లేదనియు మార్లే వ్రాసిన గ్రంథమువలననే బయల్పడినది. (Recollections of Lord Morley). బ్రిటిషు ప్రభుత్వమువా రే ప్రత్యేక ప్రాతినిధ్యపద్ధతిని 1907 లో మింటో మార్లే సంస్కరణములందు చేర్చిరి. నూతన ఇండియా రాజ్యాంగ సంస్కరణములను జేయుటలో మహమ్మదీయుల కేగాక ఇతర వర్గములవారికిగూడ ప్రత్యేక ప్రాతినిధ్యము నిచ్చుటకు బ్రిటిషువారు నిశ్చయించి రాజ్యాంగ సంస్కరణల నాటకము జరిపిరి. భారతదేశమును శాశ్వతముగా తమ చేతులలో నుంచుకొనుట కే యీ మిత్రభేద పద్దతు లవలంబింపబడినవి.
ఇట్లు నేడు భారతదేశ స్వాతంత్ర్యమునకు ప్రతిబంధకము లని బ్రిటిష్‌వారు చెప్పు అవిద్యాంధకారము, అనారోగ్యము, దారిద్ర్యము, హిందూమహమ్మదీయ కులకక్షలు మొదలగు సమస్యలెల్ల సామ్రాజ్యతత్వమున కనుగుణముగా బ్రిటిష్ రాజ్యతంత్రజ్ఞులు కల్పించినవేయై యున్నవి.
ఏడవప్రకరణము
మర్యాదలలో మార్పులు
I
ఆంగ్లేయు లీ దేశమునకు మొట్టమొదట వర్తకము చేయుటకొరకు వచ్చిన రోజులలో నీ దేశాధీశుడగు మొగలు చక్రవర్తి పట్లను ఆయన సామంతుల పట్లను వారుచాల భయభక్తులతోను అతి వినయముతోను ప్రవర్తించుచుండుటయేగాక,