122
భారత దేశమున
బడుటగాని నిర్బంధముగాని మరణముకాని కలుగలేదని వ్రాసియున్నాడు. మరియు నతడనేక రాజపుత్రుల కుద్యోగములిచ్చి గౌరవించెననియు వ్రాసినాడు.,
ఈ హిందూ మహమ్మదీయ మతవైరములను నవి బ్రిటిషుప్రభువులు తెచ్చిపెట్టినవేయని సర్ హెన్రీకాటన్ గారు తన గ్రంథములలో వ్రాసినారు. “కొందరు బ్రిటిషు అధికారులు సిమ్లాలోను లండనులోను కుట్రలుచేసి మహమ్మదీయ నాయకులను రేపి మహమ్మదీయులపట్ల పక్షపాతముజూపి హిందూమహమ్మదీయులమధ్య విరోధబీజము నాటినారు" అని ఇంగ్లాండుకు ప్రధానమంత్రిగా పనిచేసిన రామ్సేమేక్డానల్డుగారు స్వతంత్ర రాజకీయ నాయకుడుగా నుండగా 1911 లో వ్రాసినారు. (The Awakening of India) ఈతడే ప్రధానమంత్రియైనప్పుడు కులభేదములను ప్రత్యేక నియోజక వర్గములకు స్థిర రూపమునిచ్చు కమ్యూనల్ అవార్డును ప్రసాదించినాడు!
ఈ మతవైరములను పెంచు రాజ్యతంత్రముయొక్క చరిత్ర 1906 నాటిది. ఆక్రిందటి సంవత్సరమే హిందువులను సాధించుటకు కర్జను వంగరాష్ట్రమును విడదీసెను. నేడు బ్రిటిషువారికి ముఖ్యస్నేహితుడగు ఆగాఖానుగారి నాయకత్వము క్రింద 1906 లో నొక చిన్న ప్రాతినిధ్యము ఆనాటి రాజ ప్రతినిధియగు మింటో ప్రభువును దర్శించి తమకు ప్రత్యేక ప్రాతినిధ్యము కావలెననియడిగిరి. ఈబుద్ధిమహమ్మదీయులకు స్వయముగాకలిగినదికాదు. ఇది మింటోగారి సలహావలననేజరిగినట్లును ఆనాడు రాజ్యాంగ కార్యదర్శిగానుండిన మార్లే కిది యిష్టము