బ్రిటిష్ రాజ్యతంత్రయుగము
121
ఢిల్లీసుల్తాను "సివిలు పరిపాలనకు మతమునకు ఎట్టి సంబంధమునులేదు. మత మనునది కేవలము వ్యక్తుల ప్రయివేటు వ్యవహారము. అది వారి మనోప్రవృత్తికి సంబంధించిన వినోదము" అనినట్లు ఎలిఫిన్‌స్టను వ్రాసియున్నాడు. ఇరువదియవ శతాబ్దిలో లెనిన్ మహాశయుడుకూడ నట్లే పలికినాడుకదా!
1542 - 45 మధ్య రాజ్యమేలిన షర్షా "మతము కేవలము వ్యక్తులకు సంబంధించిన చిత్తవృత్తి" యనియు దీనికి ప్రాముఖ్యత నొసగకుండా బహిరంగ జీవనమునందు కేవలము రాజకీయ పరిజ్ఞానమును కలిగించుటయే తన యుద్దేశమనియు వెల్లడించెను. (K.Quanungo- Shershah)నాదిర్ షా దేశమును దోచికొన వచ్చినప్పుడు మహారాష్ట్రరాజ్యమును స్థాపించుటకు ప్రయత్నించుచున్న పీష్వాబాజీరావు తన యుద్దములను కట్టిపెట్టి “మన అంతఃకలహము లిప్పుడు ఆలోచింపతగినవికావు. హిందూస్థానమునకిప్పు డొక్కడే శత్రువుకలడు; హిందువులు ముసల్మానులు దక్షిణాపథముయొక్క జనులెల్లరును ఇప్పుడు నడుము కట్టవలెను" అనినాడు (Grant Duff - History of Maharattas).
మహమ్మదీయుల పరిపాలనలో హిందువులకు సివిలుమిలిటరీయుద్యోగములు విరివిగా ఒసగబడుచుండుటయు ఈహిందూమహమ్మదీయులు విశ్వాసపాత్రులై యుండుటయు ఎల్‌ఫిన్‌స్టన్ తనహిందూదేశ చరిత్రలో వర్ణించియున్నాడు. కేవలము మతావేశపరుడని ప్రసిద్దిజెందిన ఔరంగజేబు కాలములోకూడా మతకారణమును బట్టి ఒక్కహిందువునికిగూడ పన్నువిధింప