120
భారత దేశమున
దీయులపట్ల పక్షపాతము చూపుట ప్రారంభించిరి. తరువాత హిందూ మహమ్మదీయులకు విరోధములు కల్పించిరి. మహమ్మదీయులకు ప్రత్యేక నియోజకవర్గము లిచ్చిరి. ఇదియే హిందూమహమ్మదీయ సమస్యయొక్క పుట్టుక చరిత్ర.
హిందూ మహమ్మదీయ మతవైషమ్యములు, కొట్లాటలను నవి బ్రిటిషు ప్రభుత్వము స్థాపింపబడకపూర్వ మీదేశమున లేవు. ఇది కేవలము మిత్రబేధముజేసి విడదీసిపాలించు కుటిల రాజ్యతంత్రముయొక్క ఫలితమే! మూడు తరముల క్రిందట సర్ ప్రఫుల్లచంద్రరాయిగారి తాతగారును ముత్తాతగారును దుర్గాపూజలకు గదైపూరుఖాజీలను ఆహ్వానించుటయు వారు వచ్చి తాంబూలములు పుచ్చుకొనుటయు జరుగుచుండెనని రాయిగారు తమ స్వీయచరిత్రలో వ్రాసినారు. (Life and Experiences of a Bengali Chemist Vol.II P.297) బ్రాడ్లీబార్టు తన వుస్తకములో (The Romance of an Eastern Capital) హిందువులు షేకుమహమ్మదు యూసుఫు గొరీకి మ్రొక్కులిడుటను వర్ణించినాడు. 1840లో “టోపోగ్రఫీ ఆఫ్ డెక్కా" అను గ్రంథమున టెయిలరు ఇట్లు వ్రాసినాడు. “హిందూ మహమ్మదీయులు, మతవైరములు, కొట్లాటలు అరుదు. ఈ రెండు తెగలవారును నెమ్మదిగా జీవించుచున్నారు. ఉభయ జాతులవారును ఒక హుక్కానే పీల్చునంత స్నేహభావము కలిగియున్నారు.”
ఇక మహమ్మదీయ ప్రభుత్వకాలమున మతవైరములు లేనేలేవు. 1295-1314 మధ్య రాజ్యమేలిన అల్లాయుద్దీను ఖిల్జీ