బ్రిటిష్ రాజ్యతంత్రయుగము
119
IV
భారతదేశమును బ్రిటిషువా రాక్రమించు నాటికి మొగలుసామ్రాజ్యమున నుండిన మహమ్మదీయ నవాబులు ధనవంతులుగను బలవంతులుగను నుండిరి. వారి నెల్లరను బ్రిటిషువారు నిర్ధనులుగను అధికారహీనులుగను జేసియుండిరి. మహమ్మదీయ మతమును అణచివేయవలయుననియే క్రైస్తవుల యభిప్రాయము, కలకత్తా రివ్యూ పత్రికలో నిట్టి వ్యాసము లనేకములు ప్రకటింపబడెను. కాని క్రమక్రమముగా దేశములో స్వధర్మరక్షణ ప్రయత్నము, ప్రజల హక్కులకొఱకు పోరాటము, భారత జాతీయచైతన్యము, కలుగుటతో హిందూ మహమ్మదీయులను విడదీసి యుంచవలెనని ఆంగ్లేయరాజ్య తంత్రజ్ఞులు గ్రహించి ఇట్టి విధానము ప్రారంభించిరి.
1821 లో ఏషియాటిక్ జర్నలులో 'కర్ణాటికన్' అనుపేరుతో రాజకీయ సివిలు మిలటరీ పరిపాలనమునందు 'విడదీసి పాలించు రాజ్యనీతి’ యవలంబింపబడవలెనని ఒక సూచన చేయబడెను. మొదట నిట్లు బహిరంగముగా చెప్పుటకు జంకుచుండిరి గాని సిపాయి విప్లవముతరువాత బాహాటముగా చెప్పసాగిరి.
1859 మే 14 వ తేదీన బొంబాయి గవర్నరగు ఎల్‌ఫిన్‌స్టన్ ప్రభు విట్లు తన మినిట్సులో వ్రాసెను. “విడదీసి పాలించు నీతిని పూర్వపు రోముసామ్రాజ్యము అవలంబించి యుండెను. మనముగూడా దీనినే అవలంబింపవలెను."
ఈఉద్దేశముతో సామ్రాజ్య తత్వజ్ఞులు మహమ్మ