118
భారత దేశమున
యుంచుకొనుటకు మీలో పైకివచ్చుచున్న యువకులగు మీతరములవారు మీ శరీరమునగల కడపటి రక్తపుచుక్కనైనను , ధారపోయవలెను.” అని ఆక్సుఫర్డు విద్యార్థుల కుపన్యసించుచు ఇండియా రాజ్యాంగమంత్రిగ నుండిన బర్కెన్ హెడ్డు హెచ్చరించినాడు. ఈ దేశము పోయినచో తమకు కూడు గుడ్డలు కరవగునని దీనిని వదలరాదని బ్రిటీషు రాజనీతిజ్ఞు లెల్లరుపలికినారు. ఈ యుద్దేశముతోనే 1858 మొదలు భారతదేశమున బ్రిటిషు సామ్రాజ్యమును గట్టిపరచుకొనుటకు బ్రిటీషు రాజనీతిజ్ఞులు, రాజప్రతినిధులు తమ యావచ్చక్తిని వినియోగింపసాగిరి, దీనికొఱకు వారనేక విధానములను ప్రయోగించిరి. సిపాయి విప్లవానంతరము చేయబడిన పరిపాలనలో సైనిక వ్యయమువలన భారతదేశమునకు విద్యయు ఆరోగ్యమును వృద్ధిజెందుటకు సొమ్ములేకుండ చేయబడినది. ఇటీవల స్వదేశ సంస్థానములను కలుపుకొనుట మానినకారణము కేవలము పరమార్థచింతవలన గాని మనపైన దయవలనగాని కాదు. దేశములో అసంతృప్తి పెరుగకుండ నుంచుటకే. మఱియునప్పటికి దేశములో మిగిలిన సంస్థానములు రాజ్యములు సారహీనములైనవి. పూర్వమంత బహిరంగముగా క్రైస్తవమతమున కలుపుకొనుటకు మతప్రచారము చేయకపోవుటకు గలకారణముగూడ అసంతృప్తి హెచ్చింపరాదనియె! అయినను నేడుకూడ క్రైస్తవమత ప్రచారము అనేక విధములుగా ప్రోత్సహింపబడుచునే యున్నది.