Jump to content

పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/141

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బ్రిటిష్ రాజ్యతంత్రయుగము

117


వస్తువులను దేశముయొక్క పారిశ్రామిక అభివృద్దికొర కుపయోగించుట, దేశముయొక్క కృషిని పాడిపంటలను అభివృద్ధిచేయుట, అందుకొరకు నీటివనరులు రోడ్లు నిర్మించుట, క్రొత్తపరిశ్రమలు స్థాపించుటయనునవి బ్రిటిషు సామ్రాజ్య తత్వజ్ఞులకు గిట్టనిపనులు. కేవలము తమ వర్తకులకును సైన్యములకును ఉపయోగించునట్లు విశేషసొమ్ము వెచ్చించి రైళ్ళను నిర్మించిరి. లంకాషైరు మిల్లుల కొరకు ప్రత్తిపంటలను పోత్సహించిరి. సింధు పంజాబుల యాక్రమణ మిందుకొఱకే యని 1858 లోనే తేలినది.

బ్రిటిషువారి నీదేశమునకు వచ్చి నెలకొనుడని అనేకవిధముల ప్రోత్సహింపసాగిరి. నీలిమందు తేయాకు తోటల యజమానుల కీదేశమున ననేక సౌకర్యములిచ్చిరి. నీలిమందు తోటలు, తేయాకు తోటలు నిట్లు వృద్ధిజెందెను. జీతబత్తెముల నమితముగా వెచ్చించి ఆంగ్లేయోద్యోగులను ప్రోత్సహించిరి. ఎడ్వర్డు సల్లివన్ 1885 లో తన ' లెటర్సు ఆఫ్ ఇండియా' లో ఈ సంగతులను వర్ణించి యున్నాడు:

భారతీయులకు తమ దేశపరిపాలనలో నెట్టి ప్రవేశము నొసగకపోవుటకు నీ బ్రిటీషుసామ్రాజ్యతత్వమే కారణము. తరువాత నెన్ని రాజ్యాంగ సంస్కరణలు చేసినను నిజమైన అధికారము ప్రజాయత్తము చేయకపోవుటకు నిదియే కారణము,

"భారతదేశముమనకు లభించిన గొప్ప బహుమతి. మనదేశమునగల జీవనాధారముల వలన సంవత్సరములో మన మారునెలలే జీవించగలము. ఈ భారతదేశమును నిలిపి