116
భారత దేశమున
సమాన ప్రాముఖ్యతగల సమస్యలు లేకుండ చేయవలెననియే. అట్టి సమస్యలు వర్ధిల్లినచో దీనినిగూర్చి దేశము నలుప్రక్కలను అల్లుకొను ఆందోళనము చెలరేగగలదనియు అందువలన బ్రిటిషు ప్రభుత్వముయొక్క నెమ్మదికి భంగము కలుగగలదనియు ఆనాటి ఆంగ్లప్రముఖులు ఊహించిరని 1858 లో పార్లమెంటరీ కమిటీయెదుట సాక్ష్యమిచ్చిన విన్ గేట్ జవాబులలో కలదు. బ్రిటిషు సామ్రాజ్య, ప్రభుత్వముయొక్క పలుకుబడిని అధికారమును గట్టిపరచుటకు చేయబడిన ప్రయత్నములో ప్రభుత్వమునకు రైతులకు మధ్య నెట్టి మధ్యవారును లేకుండచేయుట యింకొకటి. రైత్వారీపద్ధతిలో రాజులకు జమీందారులకు పాలెగాండ్రకుగల అధికారములు పలుకుబడి తగ్గించివేయబడెను. కరణము మునసబులకు తాహ్సీలుదారులకు నీరైతుల నప్పగించిరి. భూస్వామికి రైతులకుగల మానవసంబంధములు నశించి రైత్వారీపద్ధతిలో కేవలము యంత్రమువలె పనిచేయు కఠినవిధానము లవలంబింపబడినవి. ఈ శిస్తులపద్దతిలో శిస్తులు చెల్లించిన పిదప రైతుకు కడుపునిండ కూడుండదు.
భారతదేశమున బ్రిటిషు సామ్రాజ్యమును గట్టిపరచుటకుచేసిన పను లింకనెన్నోకలవు. క్రిమినలువిచారణ పద్ధతులు ఆయుధశాసనము, నిర్బంధశాసనము , శిక్షాస్మృతియు నీయుద్దేశముతోనే స్థాపింపబడెను. సిపాయి విప్లవానంతరము ప్రజాస్వాతంత్ర్యము నిరోధించు అనేక శాసనములు చేయబడెను. భారతదేశ ప్రజలను అణచియుంచుటకు శాసనధర్మ ముపయోగింపబడసాగెను. దేశముయొక్క ప్రకృతి సంపదను ముడి