పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/139

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బ్రిటిష్ రాజ్యతంత్రయుగము

115


లేకపోయిరి. వివాద లధికములయ్యెను. కక్షలు ప్రబలెను. పూర్వము డబ్బు పుట్టుటయె కష్టము. ఇప్పు డట్లుకాదు. అప్పులిచ్చు షాహుకారులు బయలుదేరిరి. ఈ షాహుకారుకు బాకీల వసూళ్ళయందు కోర్టులు తోడ్పడసాగెను. ఋణగ్రస్తత హెచ్చి వ్యాజ్యములు వర్ధిల్లి ప్రజల దారిద్ర్యమును పెంచెను. (చూడు: తాంప్సన్ , గెర్రాట్‌గార్ల బ్రిటిష్‌రూల్).

III

సిపాయిల విప్లవానంతరము భారతదేశ సైన్యమును సంస్కరించుట యను మిషతో నేటివుల చేతులలో నుండిన నవీన మారణ యంత్రములను తీసివేసి మందుగుండుసామాను శాఖ నాంగ్లేయుల వశముచేసిరి. ఆంగ్లేయోద్యోగులను హెచ్చించిరి. ఆంగ్లేయుల జీతబత్తెములను హెచ్చించిరి. ప్రారంభములో ఆంగ్లేయ సైన్యములు భారతీయోద్యోగులక్రింద పనిచేయుట పరువుతక్కువగా నెంచబడలేదు. తరువాత నాంగ్లేయసైనికుడు భారతీయోద్యోగికి సలాము చేయుటగూడ పరువుతక్కువగా నెంచబడుచుండెను. ఈ సంస్కరణల వలన భారతదేశీయులను నిర్వీర్యులుగ జేయుచుండిరి. భారతదేశమున బ్రిటిషుప్రభుత్వమును గట్టిచేసికొనుటకు వారవలంబించిన విధానములలో సిపాయి విప్లవానంతరము వివిధరాష్ట్రముల ప్రభుత్వములకు ఒకదానితో నింకొకదానికి సంబంధము లేకుండాచేయదలచుట యొకటి. దీనికి రాష్ట్రీయ స్వపరిపాలనమని నేతిబీరకాయవంటి పేరు పెట్టిరి. ఈ మార్పునకు కారణము భారతదేశమంతటికిని