Jump to content

పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/137

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బ్రిటిష్ రాజ్యతంత్రయుగము

113


బడలేదు సరి కదా మంచి పరీక్షలం దారితేరినవారినైను నియమింపరైరి. ఆరోజులలో నింగ్లాండులోని నార్మలు స్కూళ్ళలో ఎలిమెంటరీ టీచర్లుగా నున్నవారి నీ దేశమున బడిపంతుళ్లై బ్రతుకుడని బంపిరి ! ఈ యుపాధ్యాయులకు ట్రెయినింగు నిచ్చుట కొక పాఠశాలను స్థాపింపుడని కోరగా సిబ్బందికి నెలకు 500 రూపాయలు ఖర్చుఅగునని వెనుకదీసిరి. ఇంకొక చిత్ర మేమనగా నీ విద్యాశాఖ కన్నీరు తుడుచుట కే నిర్మింపబడి ఎట్టి ప్రోత్సాహము లేక జనులందు విద్యాభివృద్ధి అక్షరజ్ఞత వృద్ధిచేయుటకు తోడ్పడదయ్యెను. -

ఇట్లు నిర్మింపబడిన ప్రభుత్వయంత్రము కేవలము దేశముపైకి విదేశీయుల దండయాత్రలు రాకుండను దేశములో అశాంతి ప్రబలకుండగను రక్షించుట కొక కత్తులబోను నిర్మించుటకే ఉపయోగించినది గాని దేశప్రజలకు ఆర్థిక రాజకీయాభివృద్ధి గాని విద్యాభివృద్దిగాని చేయుట కుపయోగింపలేదు. పూర్వము కంపెనీ పరిపాలనకన్నను ఈ ప్రభుత్వము నిర్జీవమై నిర్వీర్యమై కేవలము ఇంగ్లాండులోని తెల్లవారి లాభముమాత్రమే ఆలోచించి పరిపాలింప సాగెను.

విదేశములతో స్వేచ్ఛగావ్యాపారము జరుగనిచ్చుట దేశములో వ్యాపారపోటీలు చేయనిచ్చుట న్యాయశాస్త్రాను సారములగు ఒడంబడికలను అమలు జరుపుట, వివిధజాతి మతముల వారితోను తరగతుల వారితోను ఎట్టి జోక్యమును కలిగించుకొన కుండుట, ప్రైవేటువ్యక్తులు పూనుకొనగల కార్యములకు అట్టి