పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/136

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

112

భారత దేశమున


తెలివితేటలును గల విద్యావంతు లెవ్వరును రారైరి. అచ్చట బ్రతుకు తెరువులేక గతిలేనివారే యిచ్చటికి వచ్చుచుండిరి. అచ్చట న్యాయశాస్త్రమునుబట్టి కుటుంబమున పెద్దకుమారునకే ఆస్తివచ్చునుగాన చిన్నకొమాళ్ళు ఏదో జీవనోపాధి చూచుకొనవలసినదే! అందులో విద్యావంతులై తెలివితేటలు గలిగి పైకి రాగలిగినవారు గాక కష్టపడలేక సామాన్య తెలివితేటలు గలిగి సోమరిపోతులైన వారుమాత్రమే ఈ దేశములోని ఉద్యోగములకొరకు ప్రయత్నించి వచ్చుచుండిరి. దీనిలో గూడా వివిధశాఖలందు తారతమ్యముండెను. ఐ. సి. యస్ . పరీక్షలో నారితేరలేని వారేసైన్యమున జేరుచుండిరి. సైన్యమున గూడ పైకిరాలేనివారే పోలీసు శాఖలోని ఉద్యోగము లపేక్షించుచుండిరి. అవియు నిగ్రహించలేని వారు మొదటి రోజులలో ఫారెస్టు (అడవులు) వ్యవసాయము మున్నగు శాఖలందు సుఖముగా కాలక్షేపము చేయసాగిరి. అడవుల శాఖ యందు మొదట తర్బీదు పొందిన ఆంగ్లేయులే లేక పోగా 1864లో డాక్టర్ డీట్రిచ్ బ్రాండిస్ అనునొక జర్మనీ దేశీయుని ఫారెస్టుల ఇనస్పెక్టరుజనరలుగా నియమించిరి. 1861 లో పోలీసు శాఖ నిర్మించినప్పుడు సైనికశాఖలోని ఉద్యోగులలో కొందరిని దీనిలో నియమించిరిగాని వారితోపాటు పైన చెప్పబడిన రెండవరకము తెలివి తేటలుగల ఇంగ్లీషు దొరలనుకూడా నియమించిరి. క్రమక్రమముగా నీ రెండవరకమువారే ప్రబలిరి. ఇక విద్యాశాఖలో అనుభవజ్ఞులగు ప్రొఫెసర్లు నియమింప