పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/134

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

110

భారత దేశమున


సర్ దినకరరావును సభ్యులుగా నియమించిరి. భారతదేశ వ్యవసాయకులయొక్క గాని వాణిజ్య పారిశ్రామిక వృత్తివంతులయొక్క గాని ప్రతినిధులను నియమించుటకు ధైర్యము చాలలేదు.

దేశపరిపాలనమునందు మద్రాసు బొంబాయి వంగరాష్ట్రములందుకూడా పంజాబు మున్నగు (నాన్ రెగ్యులేషను ప్రావిన్సు) రాష్ట్రములందు వలెనే జిల్లాకలెక్టరు మేజస్ట్రీటు సర్వాధికారిగా నుండవలెనని వారియూహ! కాని క్రమక్రమముగా వ్యాపారాభివృద్ధివలన నగరము లభివృద్ధియై సివిలు పరిపాలన వృద్ధిచెంది జిల్లా అధికారియొక్క నిరంకుశాధికారమునకు ప్రజాభిప్రాయమును జిల్లాకోర్టులును అడ్డుతగిలెను. శాసన నిర్మాణసభలు చేసిన ల్యాండు రివిన్యూ చట్టము అడవుల చట్టము పీనలుకోడ్డు క్రిమినలు పొసీజరు కోడ్డులు మొదలు, పశువుల అక్రమ ప్రవేశ చట్టమువరకును అనేక చట్టములును క్రొత్తగా నిర్మింపబడిన అధికారశాఖలును జిల్లా యధికారి నిరంకుశాధికారములకు భంగము కలిగించెను గూడ క్రొత్తగా విభజింపబడిన వివిధశాఖలకు గూడ ఆంగ్లేయాధికారులే నియమింపబడి రాష్ట్రప్రభుత్వముక్రింద పనిచేయసాగిరి. ఉదాహరణమునకు 1861 లో చేయబడిన పోలీసు చట్టమువలన పోలీసు సిబ్బంది వ్యవహారములు ఆంగ్లజిల్లా పోలీసు సూపరెంటుక్రింద నుంచబడెను. పూర్వము కంపెనీ పరిపాలన మందువలెగాక 1858 లో స్థాపింపబడిన పార్లమెంటు ప్రభుత్వముక్రింద ఆంగ్లేయోద్యోగుల సంఖ్యను హెచ్చుచేయుటకు ఎట్టి సంకోచ