బ్రిటిష్ రాజ్యతంత్రయుగము
109
అందువలన దేశవ్యవహారములు తెలిసిన వారినే అన్ని యుద్యోగములందు నియమింపదలచిరి. అట్టి వానినే వైస్రాయిగా నియమింపదలచి సర్ జాన్ లారెన్సును 1864లో నియమించిరి. అనుభవశాలురును సమర్థులునునగు ఆంగ్లేయోద్యోగులను జిల్లా యధికారులుగా నియమించి వారు దేశములో పర్యటనము చేయునట్లు 1860 లో నిర్ణ యించిరి.
భారతదేశ పరిపాలన విషయమై చాల కాలమువరకు కంపెనీ డైరెక్టర్లు పంపు తాఖీదు లింగ్లాండునుండి ఇచ్చటికి చేరునప్పటికి కొన్నినెలలు పట్టుచు ఈలోపున పుణ్యకాలము గడచి పోవుటయు ధైర్యశాలియగు గవర్నరుజనరలు ఉత్తర ప్రత్యుత్తరములు వచ్చులోపుగా తనకు తోచిన ప్రకారము జరిపి వేయుటయు దానిని కాదనుటకు డైరెక్టర్లు ఇష్టపడక హర్షించుటయు జరుగుచుండెను. తరువాత 1870 లో నింగ్లాండుకు భారతదేశమునకు సముద్ర తంతివార్త పద్దతి స్థాపింపబడగా భారతదేశ పరిపాలనను గూర్చి ఈ దేశ గవర్నరుజనరలు అనుదినము రెండుసార్లు ఇంగ్లాండులోనుండు పార్లమెంటుమంత్రితో నాలోచించి ఆ ప్రకారమే జరుపు పద్ధతి వచ్చెను. భారతదేశ వ్యవహారములను గూర్చి ఆంగ్లేయోద్యోగుల అభిప్రాయమునే గైకొను పద్దతికూడ వచ్చెను. 1861 లో క్రొత్త శాసన సభలు స్థాపించినను వానిలో భారతీయ ప్రతినిధులను నియమించుటకు వెనుదీసిరి. తరువాత కేవలము ఆంగ్లేయ ప్రభుత్వమునకు లోబడియుండు సామంత రాజకుటుంబములకు సంబంధించినపాటియాలా మహారాజును బెనారసు రాజును