పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/130

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

106

భారత దేశమున


ఎట్టి విచక్షణయు లేకుండా నిట్టి అత్యాచారములు జరుగుచుండెనని వ్రాసినాడు. పట్టణములు గ్రామములు నిర్మానుష్యములై పోవుటకు సిద్ధముగా నుండెను.

భారత దేశములో తరువాత వచ్చిన తిరుగుబాటులు కూడా ఇంత క్రూరముగనే యణచివేయబడెను. 1872 లో 300 మంది స్త్రీపురుషులు కొట్లా సంస్థానమున మలాదుక్యాంపుపైన దాడివెడలగా ఎట్టి విచారణయులేకుండా వీరిని పట్టుకొని 50 మందిని పిరంగిమూతిదగ్గరనుంచి ప్రేల్చివేసిరి. భారతదేశ గవర్నమెంటు తమ అసమ్మతిని దెల్పిరిగాని ఇది చేసిన ఇరువురు బ్రిటిషు ఆఫీసర్లలో నొకనికి సర్ బిగుద మివ్వబడి వైస్రాయివద్దకు రాయిబారిగాకూడా త్వరలోనే పంపబడినాడు.

ఇట్లే అమృతసరమున 1919 లో జరిగిన వధలో 379 మంది చచ్చినట్లును 1200 మంది గాయపడినట్లు ప్రభుత్వమువారే అంగీకరించినారు. ఇది చేసినవా రెవ్వరుశిక్షింపబడలేదు. పైగా డయ్యరు సేనాని పూర్తి పింఛనుమీద ఉపకారవేతన మందినాడు. అతనివెంట నుండిన యుద్యోగులు చాలమందికి ప్రమోషనువచ్చినది. ఇటీవల 1930 లో సత్యాగ్రహోద్యమమున షోలాపూరులోను పిషావరులోను అల్లరులుజరుగగా వాని నణచుటకని ప్రభుత్వమువారు సోల్జరులను మరఫిరంగిమోటారులను ఉపయోగించి అనేకుల ప్రాణములు దీసిరి. కేవలము సాత్విక నిరోధముచేయు శాంతిసైనికులను దేశసేవకులను హింసించిన పద్దతులుకూడ అంద రెఱుగుదురు.