పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/129

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బ్రిటిష్ రాజ్యతంత్రయుగము

105


నిరంకుశ పద్దతులు చేయు దారుణ చర్యలు పూర్వకాలము నాటి అనాగరక ప్రభుత్వముల నిరంకుశపద్ధతులకు గాని నేడు ఇటలీ జర్మనీలలో అవలంబింపబడుచున్న ఫ్యాసిస్టుక్రూరపద్దతులకు గాని ఏ మాత్రము తీసిపోవునవి గావని భారతదేశ స్వాతంత్ర్యము కొరకు 1857 లో జరిగిన సిపాయిల విప్లవము నాటినుండి నేటివరకును జరుగుచున్న ఉద్యమముల నణచుటలో బ్రిటిషువా రవలంబించు విధానములవలన విదితమగుచున్నది.

సిపాయిల విప్లవము తరువాత శాంతి భద్రతలను స్థాపించుటకని బ్రిటిషు వా రమలు జరిపిన తీవ్రసైనిక శాసనము, ప్రభుత్వోద్యోగులు న్యాయాధిపతులు సైనికులు గావించిన దారుణచర్యలు, ఎట్టిన్యాయ విచారణ విచక్షణ లేకుండ కాల్చుటలు, ఉరిదీయుటలు, మొదలగు అక్రమములను గూర్చి అనేక గ్రంథములందు వర్ణింపబడియున్నది.

సిపాయిల విప్లవము తరువాత ఢిల్లీ వశము కాగానే విప్లవమునకు కారకులని, కనపడిన మహమ్మదీయ ఘాజీల నందరిని ఉరిదీయ సాగిరి. ఒక న్యాయాధిపతి ఘాజీ ఎవడో కానివాడెవ్వడో తాను బాగుగా కనిపెట్టగలనని చెప్పుచు అనేక నిరపరాధుల కురిశిక్ష వేసెను. బ్రిటిషు సోల్జర్లు సిక్కులతో కలిసి చేసిన దారుణకృత్యములకు మేరలేదు. ఒక గాయపడిన ఖైదీ మొగముపైన (బెయోనెట్సు) సన్నీలతో పొడిచి మెల్లగా కాలుచున్న నిప్పుపైన పడవేసి కాల్చి చంపిరి. వేలకొలది ఫిరంగి ముఖముల ప్రేల్పబడిరి. ఎట్టివిచారణయు లేకుండా గ్రామరైతు లనేకులు వధింపబడిరి. టైమ్సు విలేఖరి గూడా