బ్రిటిష్ రాజ్యతంత్రయుగము
103
బహుమతులు, చైనా పరిష్యా దేశములలో బ్రిటిషువారి ప్రతినిధుల ఖర్చులు (Consular and Diplomatic establishments) మధ్యధరా సముద్రములో కాపలాగా నుంచిన యుద్ధనౌకాదళముయొక్క సాలియానా కర్చులలో కొంతభాగము, ఇంగ్లాండునుండి ఇండియాకు వేయబడిన టెలిగ్రాపులైనుకు అయిన యావత్తు ఖర్చు, ఇవియన్నియు ఇండియా లెక్క నే ఖర్చు వ్రాయ బడినవి. ఇండియా బ్రిటిష్‌రాజు క్రిందికి వచ్చిన తరువాత 13 సంవత్సరములలో నిండియానుండి వసూలు చేయబడు పన్నులు 330 లక్షల పౌసులనుండి 520 లక్షల పౌనులకు పెరిగెనన్న ఆశ్చర్యమేమి? ఇట్టి కర్చులన్ని యు పూడవలదా! అట్లయ్యు 1866 మొదలు 1870 సంవత్సరమువరకు అనగా నాలుగు సంవత్సరముల బడ్జెట్టులో ఆదాయముకంటె 115 లక్షల పౌనుల వ్యయము అధికముగ కనపర్చబడినది. 1857-1860 సంవత్సరముల మధ్య 300 లక్షల పౌనుల ఋణము ఈ దేశముమీద నిర్ధారణచేయబడి అప్పటినుంచి క్రమక్రమముగా పెంచబడుచున్నది. ఇట్లు ఋణము పెరిగిపోవుచుండగా నిండియాను పరిపాలించు బ్రిటిషు పరిపాలకులు కర్చు తగ్గించుటలోను మితవ్యయము చేసి దేశముయొక్క ఆర్ధికస్థితిని బాగుపరుచుటలోను నిపుణులని ఖ్యాతి సంపాదించుకొనుచు నైపుణ్యముతో ఇండియాదేశపు లెక్కలను ఆర్థికపట్టికలను చమత్కారముగా తయారుచేసి ప్రచురించుచున్నారు.