102
భారత దేశమున
ఋణభారమును మోపిన విధానము అపూర్వము. పరిపాలనా విధానములో నెట్టి ప్రాతినిధ్యమును, పలుకుబడియు లేనిరైతుమీద నెన్నెన్నియో భారములు వేయబడినవి. సిపాయి మ్యూటినీకి కర్చులు, ఈస్టిండియా కంపెనీవారి హక్కులను బ్రిటిషురాజ్యాంగమువారికి ట్రాన్సుఫరు చేసినందుకిచ్చిన సొమ్ము, చైనాలోను అబిసీనియాలోను ఏకకాలమునందు జరిగిన యుద్ధములఖర్చులు, లండనులో ఇండియా ఆఫీసు ఊడ్చేపనికత్తెజీతము మొదలగు ఇండియాకు అత్యంత దూరపు సంబంధముగల గవర్నమెంటు ఖర్చులన్నియుగాక, రానున్న యుద్ధములకై అమలు చేయబడి, సముద్ర ప్రయాణముచేసియు, యుద్ధములలో చివరకు పాల్గొనకనే తిరిగివచ్చిన ఓడలకైన ఖర్చులును, ఇండియాకు పంపుటకై యింగ్లాండులో ఆరుమాసములు శిక్షణము పొందు పటాలముల ఖర్చులును ఇవియున్నియును అమాయకపు రయితు లెక్కలోనే కర్చు వ్రాయబడినవి. 1868 సంవత్సరములో టర్కీ సుల్తానుగారు సపరివారముగా వైభవముతో ఇంగ్లాండు చూచుటకు వెళ్ళియుండిరి. అప్పుడు వారికి లండనులో ఇండియా ఆఫీసులో గొప్పవిందు జరిగెను. ఆసందర్భమున సుల్తానుగారి ఆతిథ్యమునకై కర్చుపెట్టబడిన సొమ్మంతయు నిండియామీదనే వేయబడినది! 1870 వ సంవత్సరమునకు పూర్వము ఇండియాక్రింద కర్చువ్రాసిన పద్దులలో నీ క్రిందివికలవు. ఈలింగు (Ealing) లో పెట్టిన పిచ్చి ఆసుపత్రి (Lunatic Asylum) కర్చులు, జాంజిబారు (zanzibar Mission) రాయబారులకు ఇచ్చిన నజరులు