Jump to content

పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/125

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బ్రిటిష్ రాజ్యతంత్రయుగము

101


సంగ్రామములోను మన సైన్యము లాంగ్లేయులకు ముందుగా తోడ్పడినవి. భారతదేశమున కెట్టి సంబంధములేని ఆప్ఘను యుద్దము (1867-68) పెర్షియాకు దండయాత్ర (1875) 2 వ ఆఫ్‌ఘన్ యుద్దము (1878–80) ఈజిప్టుయుద్దము (1882) సూడాను యుద్ధము ఇంగ్లాండుకొఱకు గావింపబడినను వాని ఖర్చును మన దేశాదాయమునుండి ఖర్చుపెట్టిరి. ఐరోపా సంగ్రామము కొఱకు 371 కోట్ల రూపాయలును సైన్యమును పుచ్చుకొనిరి.

భారతదేశమున నాంగ్లేయులు అనేక కోట్లరూపాయలు పెట్టుబళ్లు పెట్టి దానిపైన కోట్లకొలది రూపాయలు వడ్డీక్రింద పుచ్చుకొనుచున్నారు. ఆంగ్లేయ సివిలు మిలిటరీయుద్యోగుల కత్యధికజీతము లిచ్చుచున్నారు. ఆంగ్లేయులు వర్తకమువలన లాభములేగాక నింక నెన్నో విధములుగా నీ దేశమువలన లాభములు పొందుచున్నారు.

IV

భారతదేశ ప్రభుత్వఋణములో 729 కోట్ల 40 లక్షల రూపాయి లనవసర ఋణమని కాంగ్రెస్ విచారణ సంఘమువారు తీర్మానించి యున్నారు. అమెరికాదేశపు సుప్రసిద్ధ ఆర్థిక పండితుడు ఎల్. హెచ్. జెంక్సు (Professor L. H. Jenks) అనునాతడు 'మైగ్రేష౯ ఆఫ్ బ్రిటిషు కాపిటల్‌' అను గ్రంథమును నవీనముగా రచించియున్నాడు. ఆ గ్రంథముయొక్క 223-224 పేజీలలో నిట్లు వ్రాసియున్నాడు.

“ఇండియా మీద బ్రిటిషువారు తమ వీలుకొరకు