Jump to content

పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/124

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

100

భారత దేశమున


బింపబడెను. భారతదేశమునుండి ఎప్పటివలెనే అనేకరూపములుగా నింగ్లాండుకు ధనము తరలింపబడుచుండెను. భారతదేశ ఆర్థిక విధానమెల్ల ఇంగ్లాండులాభముకొఱకే వినియోగింపబడ సాగెను. మర్యాదకొర కా మాట చెప్పకపోయినను భారతదేశ మింగ్లాండుయొక్క బానిసరాజ్యముగనే ఉపయోగించుకొనబడుచున్నది.

భారతదేశము బ్రిటిషువారి పాడియావు. . ఇంగ్లాండుదేశపు ప్రజలకు ఆహార పదార్దములను సరఫరా చేయుచున్నది. వారి పరిశ్రమలకు గావలసిన ముడివస్తువులను పంపుచున్నది. వారివస్తువులను హెచ్చుధరలకు గొనుచు వారివర్తకము నభివృద్ధి చేయుచున్నది. వారు తమ వలస రాజ్యములను బాగుచేసికొనుటకు కూలీలనంపినది. ప్రపంచములోనిఅన్ని భాగములందు ఇంగ్లీషువారు చేసిన సామ్రాజ్యయుద్ధములకు గావలసిన సైన్యములను ధనమును పంపినది. సామ్రాజ్య సంపాదన చేసిపెట్టినది. ఇంగ్లాండువారు సైనిక విధానములం దెట్టి నూతనప్రయోగము గావించుకొనదలచినను అట్టివానికి అవకాశము కలిగించి వ్యయము భరించినది. ఆంగ్లసైనికులు తర్ఫీదుపొందుటకు శిబిరముగా నుపయోగింప బడుచున్నది.

భారతదేశ ధనమును సైన్యమును ఆంగ్లేయులు తమ సామ్రాజ్యసంపాదన కుపయోగించు కొన్నారు. ప్రపంచములో నలుప్రక్కలనుగల తమ రాజ్యములందు కల్లోలము నణచుకొనుట కుపయోగించుకొన్నారు. బోయరు యుద్ధములో భారతీయ సైన్యములు వారికి ముందుగా తోడ్పడినవి. ఇట్లే ఐరోపా