Jump to content

పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/123

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బ్రిటిష్ రాజ్యతంత్రయుగము

99

1843 లో సింధురాష్ట్రముపైన చార్లెస్ నేపియరు దండయాత్రచేసి కలుపుకొనినప్పుడు నేపియరు ఉద్యోగులు స్త్రీలను అమీరుల జనానాలోనికి పంపి ఆ రాజస్త్రీల నగలను ధనమును తుదకు వస్త్రములనుగూడ బలవంతముగా లాగికొని హరించిరి. వారిని చిత్రహింసలు పెట్టిరి. (History of Afghans-G. P. Ferrier)

ఇటీవల నిట్లు బహిరంగముగా దోచుకొను పద్దతి పోయినదిగాని గవర్నరుజనరలును గవర్నర్లును పర్యటనములు చేయునప్పుడు మహారాజు లిప్పటికిని వారికి లక్షలకొలది విలువగల బహుమతులనిచ్చు పద్దతి జరుగుచునేయున్నది.

III

కంపెనీ పరిపాలనపోయి రాణిపేరున పార్లమెంటు పరిపాలనవచ్చిన (1858) పిమ్మట గూడ పూర్వమువలెనే భారత దేశపరిపాలన మీదేశ ప్రజలలాభముకొఱకు చేయవలయునా ఆదేశ ప్రజల లాభము కొఱకు చేయవలయునా అను సమస్య బ్రిటిషురాజ్య నీతిజ్ఞుల మనస్సులందెల్లప్పుడును మెలగుచుండెను. విక్టోరియారాజ్ఞి ప్రకటనలోని వాగ్దానము లెల్ల నిజముగా చెల్లించినచో నీ దేశ ప్రజలకు లాభమును ఆదేశీయులకు నష్టమును కలుగును. అందువలన నవి కేవలము కాగితపు వాగ్దానములుగనే యుంచి ప్రాతవిధానమునందు వలెనే క్రొత్తవిధానమునందుగూడ భారతదేశ భాగ్యభోగ్యముల నింగ్లాండు లాభముకొఱకుపయోగించు పద్ధతు లవలం