Jump to content

పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/121

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బ్రిటిష్ రాజ్యతంత్రయుగము

97


ఈనాటిద్రవ్యార్జనముకూడ రెండువిధములుగ నుండెను. కంపెనీవారిపేరున బహిరంగముగా పుచ్చుకొనినది; కంపెనీ యుద్యోగులు ఎవరికిదొరకినది వారుపుచ్చుకొనినది. దీనికి జమాఖర్చులు లేవు. తరువాత వెలస్లీ గవర్నరుజనరలు యుద్ధముల కాలములో స్వదేశ సంస్థానాధీశులనుండి లెక్క లేనంత సొమ్ము వసూలుచేయబడినది. డల్ హౌసీ కాలమువరకు నిట్లు అవిచ్చిన్నముగా జరిగినది. ఆ కాలములో భారతదేశమునుండి సీమకు తరలింపబడిన వజ్రములకు, రత్నములకు, ధన సంచయములకు లెక్క లేదు. అట్టి దోపిడి ద్రవ్యములలో చేరినది "కోహినూరు" వజ్రమొకటి. క్లైవు, వాన్సిటార్టు, వారన్ హేస్టింగ్సులు చేసిచూపిన దోపిడిపుచ్చుకున్నలంచములు, గవర్నరులు, కౌన్సిలు మెంబర్లు, సామాన్యోద్యోగులుగూడ అవిచ్ఛిన్నముగా సాగించి లక్షాధికారు లగుచుండిరి. ఇక యుద్ధములందు సైన్యములు సేనాధిపతులు ఉద్యోగులమాట చెప్పనక్కరయేలేదు. పై అధికారినుండి క్రిందివాని వరకును అందరికిని దోపిడీలో భాగముండెను. దండయాత్రలయందు పట్టణములను కొల్లగొట్టి ఎవరికి దొరకినది వారు దోచికొనుట సర్వ సామాన్యమగు హక్కుగానుండెను. యుద్ధానంతరము సంధి జరిగినప్పుడెల్ల స్వదేశరాజులు విశేషధనమును ఉద్యోగులకిచ్చి ఆసంధి నిలుపుకొనవలసి యుండిరి. టిప్పుసుల్తానుతో సంధిచేసినప్పుడు 3 లక్షల పౌనులిట్లు లాగికొనిరని మాల్కలం చెప్పుచున్నాడు. 1799 లో వెల్లస్లీ కాలములో నిట్లు బహుమాన ద్రవ్యముమాట వచ్చినప్పుడు ఒకలక్ష, పౌనులు నిర్ణయింపబడెననియు వెలస్లీ ఆ