Jump to content

పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/120

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

96

భారత దేశమున


వృద్ధికాసాగెను. కరవులు ప్రారంభమయ్యెను. ఈ ధన ప్రవాహము నాలుగురకములుగా గొనిపోవబడుచుండెను. భారత దేశరాజులు పరిపాలకులవలన కంపెనీ వారు గైకొనిన కప్పములు, కంపెనీవారిపేరున ప్రజలపై విధింపబడిన పన్నులు, దేశములో కంపెనీసేవకులు చేయుచుండిన స్వంతవర్తక లాభములు, నేటివురాజులవలన నవాబులవలన వారి స్నేహితులు బంధువుల వలన వారితోడి సంబంధములందు కంపెనీ గైకొనిన లంచములుగాక రహస్యముగను బహిరంగముగాను సొమ్ము గైకొనబడుచుండెను. ఒక్కొక్కప్పుడు బలవంతముగా కూడ గైకొన బడుచుండెను. ఇట్లు లాగికొనబడిన ధనములో కొంత భాగముతో భారతదేశ సంపదకు సంబంధించిన ముడివస్తువులు కొని ఇంగ్లాండుకు, నితర దేశములకు పంపుచుండిరి. కొంత రొఖ్కముగానే పంపుచుండిరి.

||

1772 మొదలు 1785 వరకు వారన్ హేస్టింగ్సు పరిపాలనకాలమునగూడా భారతదేశరాజులనుండి నవాబులనుండి ప్రజలనుండి చాలా పెద్దమొత్తముల ధనము, విశేష విలువగల సరకులు గ్రహింపబడి సీమ కంపబడెను. దీనికి ప్రతిఫలము కంపెనీవారు భారతదేశమునకు చేసిన “ సేవ" లని చెప్పబడెను. ఈ “ సేవ” లే ఆనాడు అయోధ్యలోను, పశ్చిమోత్తర ఆగ్రా పరగణాలలోను, దక్షిణాపథములోను యుద్ధములకు కారణములైనవి.