పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/119

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బ్రిటిష్ రాజ్యతంత్రయుగము

95


ప్రవహించుటకు పూర్వము 50 సంవత్సరముల క్రిందటనే ఈ యంత్రములు కనిపెట్ట బడియుండినచో వీనిని పరిశ్రమలలో నుపయోగించుకొనుటకు వలసిన పెట్టుబడికి మూలధనము లేక యీక్రొత్తయంత్రములు వీని నిర్మాతలుగూడ నశించి యుందురు. తరువాత నచ్చట విరివిగా స్థాపింపబడిన ఫ్యాక్టరీలకు గావలసిన సొమ్ము లేక అవి తలయెత్తియుండవు. ఇట్లు ఆంగ్లేయ పారిశ్రామిక పరివర్తనము, ఆంగ్లేయ ఔన్నత్యము సామ్రాజ్యముగూడ భారతీయులు దాచుకొనిన ద్రవ్యముపైననే నిర్మింపబడినవి. ఎట్టిశ్రమయు లేకుండా వడ్డీ లేకుండా నిట్లు భారతదేశమునుండి తెచ్చిన అమితధన సంచయము నాధారము జేసికొని ఇంగ్లాండులో నొక విధమగు ద్రవ్య పరపతి స్థాపింపబడెను. అప్పు విరివిగా పుట్టుటవలన అచ్చటి పరిశ్రమలేగాక వ్యవసాయము పాడిపంటలు గూడ వృద్ధిజెందెను. కొనయూపిరితో పడియుండిన ఆంగ్లకర్షకులు కార్మికులు నొక్కసారిగా విజృంభించిరి. ఇంగ్లాండులో బొగ్గు, ఇనుము పుష్కలముగా గలవు. దీనికి ద్రవ్యపరపతి తోడుపడగా ఆంగ్లేయపరిశ్రమలు అభివృద్ధిజెంది అమెరికా ఐరోపాలలోను ప్రపంచ పణ్య చక్రములోను గూడ విజృంభించెను. తుదకు కలకత్తాలో భారతీయ కూలీలుచేయు సరకులతో కూడ పోటీచేయగలిగెను.

ఇట్లు నిరంతరముగా భారతదేశమునుండి ఇంగ్లాండుకు ధనము ప్రవహించి పోవుటవలన మన దేశముయొక్క పారిశ్రామిక వ్యవసాయాభివృద్ధికి వలసిన ధనములేక దారిద్ర్యము