94
భారత దేశమున
చెప్పినట్లు సముద్ర తరంగములవలె బంగారము భారతదేశమునుండి ఇంగ్లాండుకు ప్రవహింపసాగెను. ఇది ఆకాలమున నింగ్లాండుకు గొప్ప అదృష్టముగా పరిణమించెను. ఈధన మింగ్లాండుకు పోవనిచో ఆనాడు క్రొత్తగా కనపెట్టబడిన ఆవిరియంత్రము, నూలు వడకుటకు నేయుటకు కనిపెట్టబడిన యంత్రమగ్గములు, వడకు యంత్రములు, పరిశ్రమలయం దుపయోగించుకొని లాభముపొందుటకు వలసిన మూలధనము లేక ఇంగ్లాండు ఆర్థిక క్షోభలో మునిగిపోయి యుండును. ఇట్లాకాలమున నింగ్లాండులో వచ్చిన పారిశ్రామిక పరివర్తనమునకు, ఆర్థికాభివృద్ధికి ప్లాసీయుద్ధానంతరము ఇంగ్లాండుకు తరలింపబడిన అమితధనము, భారతదేశ భాగ్యభోగ్యములే మూలకారణమయ్యెనని బ్రూక్ ఆడమ్సు మున్నగు ఆంగ్ల చరిత్రకారులు అర్థశాస్త్రజ్ఞులు నంగీకరించినారు. ఇట్లు ఇంగ్లాండు యొక్క అదృష్టము 1760తో ప్రారంభమయ్యెను. మనదారిద్ర్యము నప్పటితోనే మొదలు. యంత్రములు నిర్మింపబడక పూర్వము నూలువడకుటకు నేయుటకు నింగ్లాండులో నుపయోగింపబడుచుండిన సాధనసామగ్రులు భారతదేశములోని పురాతన వస్తువులవంటివే. 1760 లోనే ఇంగ్లాండులో (Flying shuttle) క్రొత్త పద్దతి కండెనేత కనిపెట్టబడెను. 1764 లో హర్‌గ్రీవు (Spinning jenny) మరరాట్నము కనిపెట్టినాడు. 1779 లో కోంప్టన్ 'మ్యూల్'ను (Mule) కని పెట్టినాడు. 1795 లో కార్టురైటు యంత్రమగ్గము కనిపెట్టినాడు. ఆవిరియంత్రము 1768 లో పరిపక్వస్థితి జెందినది. భారతదేశమునుండి ఇంగ్లాండుకు ధనము