Jump to content

పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/117

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బ్రిటిష్ రాజ్యతంత్రయుగము

93


గోలకొండ వజ్రములుగల మొగలుచక్రవర్తినుండి వెండి బంగారు నాణెములుగల సామాన్యజనునివరకును ద్రవ్యము కూడబెట్టుకొనుట యనున దీ దేశీయుల నైజగుణము. ఇట్లు కోట్లకొలది జనులు తరతరములనుండి దాచుకొనిన ధనసంచయములనెల్ల ఆంగ్లేయులు పట్టుకొని లండనునగరమునకు తరలింపసాగిరి. ఇట్లు పట్టుకొనివెళ్ళిన ధనసంచయ మెంతవిలువగలదై యుండునో ఎవ్వరును చెప్పజాలరు కాని అనేక కోట్లరూపాయలు విలువగలదై యుండునని మాత్రము అందరు నంగీకరించి తీరవలెను. ఇది యానాడు ఐరోపాలో నుండిన వెండిబంగారుల మొత్తము విలువకన్న నెన్నో మడుగు లధికముగనుండెను. (Brooke Adams - Law of Civilization and Decay. P. 305) ఇంగ్లాండునుండి భారతదేశమునకు బంగారు దిగుమతి చేయబడిన కడపటిసంవత్సరము ప్లాసీయుద్ధము జరిగిన 1757 వ సంవత్సరమే యని యిదివరకే చెప్పబడినది. ఆ సంవత్సరముతో చైనాకు బంగారము పంపుట కూడా తగ్గిపోయినది. పంపబడు బంగారమెల్ల భారతదేశము నుండియే పంపబడుచుండెను. మరియు నీ ప్రవాహ మెదురు తిరిగినది. అప్పటి నుండి, మద్రాసునుండియు, చైనానుండియు ఇంగ్లాండుకు వచ్చు. ప్రతియోడలోను బంగారము పంపబడుచుండెను. ఈ సంగతి కంపెనీ డైరక్టరుల యుత్తరప్రత్యుత్తరముల వలన తేలుచున్నది. (Bruce-Plan for British India. 314-315) బంగారము ప్రోగుచేసి పంపుటకుగూడ కంపెనీ నౌకరులకు భారతదేశమున అనేక అవకాశములుండెను. మెకాలే