92
భారత దేశమున
రముతప్ప దేశములో మూలధనము లేదు. పారిశ్రామిక వాణిజ్యవస్తునిర్మాణములు లేవు. 17 వ శతాబ్ది ప్రారంభములో, నింగ్లాండు ప్రజాపీడనముతో అంతఃకలహములతో బాధపడుచుండెను. వ్యాపారాభివృద్ధికొఱకు వలసిన మూలధనములేదు. వ్యాపారములో డచ్చివారి పోటీ యత్యధికముగా నుండెను. 17 వ శతాబ్ది యంతమునాటి కీపరిస్థితు లతి తీవ్రరూపము దాల్చి దేశప్రజలలో దారిద్య్యము అసంతృప్తియు హెచ్చిపోయెను. ఐరోపాదేశము లన్నిటిలో గూడ ద్రవ్యక్షామము కలుగు సూచనలు పొడగట్టెను. దీనికిముఖ్యకారణము ఆశియానుండి దిగుమతిచేయు వివిధవస్తుజాలముకొఱకు పంపివేయబడు చుండిన బంగారు ఆదేశములందలి దవ్యమును తోడివేయుటయే. అందువలన వివిధ దేశముల నాణెముల విలువ పడిపోసాగెను. ఇంగ్లాండులో దొంగనాణెముల చెలామణి వృద్ధియయ్యెను. వెండినాణెములందు ఇనుముకల్తీ కలుపబడుచుండెను. మఱియు ఇత్తడి మొదలగు లోహములు కూడా కల్తీ చేయుచుండిరి.
1710 మొదలు 1720 వరకు పది సంవత్సరములలో ఆంగ్లేయవర్తకకంపెనీవా రింగ్లాండునుండి భారతదేశమునకు సాలుకు సగటున 43,44,000 పౌనుల విలువగల బంగారము ఎగుమతి చేయుచుండిరి.
ఈకాలములో నింగ్లాండు ఎట్లు జీవింపగల్గినది? అనుసంగతి చాల ఘోరమైనకథ. ఆనాడు వెండిబంగారుల నెల్ల ఆశియా ఆకర్షించి వేయుచుండెనని జీవన్సు చెప్పియున్నాడు.