బ్రిటిష్ రాజ్యతంత్రయుగము
91
చేయబడు యెగుమతులు 8 వేల పౌనులనుండి 30 లక్షల పౌనుల విలువవరకును పెరిగెను.[1]
ఆంగ్లేయ వర్తకకంపెనీ వారి లాభములు ద్విగుణీకృతము లయ్యెను. 1676 లో ప్రతివాటాదారునకు అతనికి గల వాటాలు ఉచితముగా రెట్టింపుచేయబడి వానిపైన సాలునకు నూటికి 2 చొప్పున 5 సంవత్సరములు లాభములు పంచి యివ్వబడెను. (మెకాలే ఆంగ్లచరిత్ర) 1677 లో వాటా 1కి 245 పౌనులుగనుండిన వాటాపత్రములు 1681లో 300 కును, తరువాత 360కును, అటుతర్వాత 500 కును పెరిగెను. ఈ అత్యధిక లాభముల కెట్టి హద్దును లేకుండెను. ఆంగ్లేయప్రభుత్వమువారు వీరివద్దనుండి కొంత సొమ్ము తీసికొనుటయు, కంపెనీ నౌకరులు లోపాయికారీ లాభములు ఆర్జించుటయు లేనిచో నింక నెంతలాభము వచ్చియుండునో !
ఆనాడు మనరూపాయి విలువ 2 షిల్లింగుల 8 పెన్నీలుగ నుండి వర్తకలాభవాటము మన కనుకూలముగ నుండెను. తరువాత రూపాయి విలువ 16 పెన్నీలకు తగ్గినది. భారతదేశములో నూలువస్త్ర పరిశ్రమ అభివృద్ధి జెందెను.
II
ఇంగ్లాండు ఆ కాలమున అనగా 16వ శతాబ్దములో ఆర్థికముగాచాలవెనుకబడియుండిన దేశము. విదేశీయులవడ్డీ వ్యాపా
- ↑ మిల్లు చరిత్ర 1 వ సంపుటము పుట 37. Plans for British India,-J. Bruce. Outlines of English Industries.-Cunningham & M.C.Arthur.