పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/114

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

90

భారత దేశమున


ఐదవ ప్రకరణము

భారతదేశమువలన నింగ్లాండు బాగుపడినవిధము

I

1617 లో భారతదేశములో నేరకము వస్త్రమైనను సూరతు పట్టణములో దొరకుచుండెను గాని దానికి బదులుగా చైనా వస్తువులు సుగంధ ద్రవ్యములు రొఖముతప్ప యితర సరుకు లెవ్వియు చెల్లుబడి గాకుండెను. ఒకటిన్నర శతాబ్దము వరకును భారతదేశమున ఆంగ్లేయ వర్తకము కేవలము, ఈ దేశమునుండి నూలు, పట్టు సరకులను, నీలిమందును సుగంధద్రవ్యములు నెగుమతిచేయుటతోనే తృప్తి జెందవలసివచ్చుచుండెను, అందువలన నాకాలమున భారతదేశములోనికి బంగారముతప్ప యిక నేసరకులును దిగుమతియేలేదు. ఇట్లు 1747 మొదలు 1757 వరకు జరిగిన పదిసంవత్సరములలోను సగటున 5,62,423 నవరసుల విలువ బంగారము భారతదేశమునకు దిగుమతియై యుండెనని బ్రూసు అను నతడు వ్రాసియున్నాడు. ప్లాసీ యుద్ధము జరిగిన (1757) తరువాత నిట్లు బంగారు దిగుమతి యగుట ఆగిపోయినది. ఈ వ్యాపారములోనే ఆంగ్లేయ వర్తకకంపెనీ యమితలాభము లార్జింప గలుగుచుండెను. . ఇంగ్లండులో రెండవ చార్లెస్ రాజ్యాధిపత్యము వహించిన పిదప 23 సంవత్సరములలోను గంగాతీరమునుండి ఇంగ్లండుకు