88
భారత దేశమున
ప్రజాభిప్రాయముయొక్క కట్టుబాటువలన నలుగురు ఛీఛీ యందురని భయముగాని, భయభక్తులుగాని లేకుండా పోయినవి. మన శాసనధర్మములవలన తటస్థించిన ఈ ఘోరస్థితిగతులను మనమేదో విధముగా సంస్కరించవలెను" అనినాడు .
V
జలాధారములు
భారతదేశము నేలిన హిందూమహమ్మదీయ రాజులు ఈ దేశముయొక్క వ్యవసాయాభివృద్ధికి వలసిన నీటివనరులు, ఆనకట్టలు, కాలువలు, తటాకములు, బావులు ఎన్నో నిర్మించిరి. నిర్మించుటయేగాక వీని నెల్లప్పుడు మంచి మరమ్మతులో నుంచుట యవసరమని గుర్తెరిగి అందుకు వలసిన కట్టుబాటులు గావించిరి. పల్లపుసాగు చేయబడు ప్రతి యకరముపైనను ఈనీటివనరుల కొరకొక స్వల్పపుపన్ను విధించుచుండిరి. ఈమరమ్మతుల ఖర్చును రైతులైన భరించుచుండిరి, లేదా రైతులును రాజులును చెరిసగమైన భరించుచుండిరి. ఈ నిర్మాణములను మంచి స్థితిలోనుంచు బాధ్యత గ్రామ పంచాయతులపై నుండెను. సింధు, పంజాబు ప్రాంతములందుతప్ప యిట్టి నిర్మాణములు తక్కిన అన్ని రాష్ట్రములందును విరివిగా నిర్మింప బడెను. ఆఫ్‌గన్ ప్రభువులలో ఫిరోజుఖాను, మొగలుచక్రవర్తులలో అక్బరు పాజహానులు, విజయనగర చక్రవర్తులలో కృష్ణదేవరాయలును ముఖ్యముగా నీ విషయమున హెచ్చు శ్రద్ద వహించిరి.
ఆంగ్లేయులు ప్రభువులగునప్పటికీ ప్రతి రాష్ట్రమునను