Jump to content

పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/111

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బ్రిటిష్ రాజ్యతంత్రయుగము

87


డిస్పాచిలో నీయాంగ్లేయ న్యాయపరిపాలనావిధానముయొక్క ఫలితముల నిట్లు వర్ణించి యున్నాడు:

“వంగరాష్ట్ర భూస్వామిత్వపద్ధతుల దుస్థితికి పన్నుల శాసనముల కన్నను న్యాయవిచారణ పధ్ధతులే హెచ్చు కారణములుగ నున్నవి. భూమిపన్ను లిచ్చుకోలేనప్పుడు భూములు వేలములు వేయబడగా ఖరీదుదారులు న్యాయశాస్త్రమును పురస్కరించుకొని రైతుకాభూములలో నెట్టి హక్కులు లేకుండా నాశనముచేసి వెళ్లగొట్టుచున్నారు. 1780 లో జిల్లా కోర్టులను స్థాపించి 1793 లో నీ న్యాయపరిపాలనావిధానమును పునర్నిర్మాణము జేసినది మొదలు మనము తలవని తలంపుగా నొక సాంఘిక విప్లవమును కలిగించినట్లు తోచుచున్నది. దీనివలన జనుల నీతిధర్మములు పాడై పోయినవి. ఇది మన ప్రభుత్వముసకును శ్రేయస్కరముకాదు. మనశాసనము వలన నొక క్రొత్తతరమువారు తయారైనారు. వీరి ముఖ్యలక్షణమేమనగా, వ్యాజ్యము లాడుటయన్న ప్రీతి. మన న్యాయవిచారణశాఖ యీవ్యాజ్యముల కాంక్షను తృప్తి పరుప జాలకున్నది. నీతి నియమములు స్పష్టముగా పాడైసోయినవి. మన న్యాయపరిపాలనా విధానములోను ముఖ్యముగా దీని నిర్వహణములోను ప్రజలకుగల నైతిక బంధనములను, మత ధర్మములయొక్క పూర్వపుకట్టుబాటులను, నీతి నియమములను సడలించి నాశనము జేసితిమి; కాని దానికి బదులుగా నెట్టి బందోబస్తులు చేయమైతిమి. అందువలన మానవ స్వభావములోని క్రోధలోభ మదమాత్సర్యములు విజృంభించి