86
భారత దేశమున
లకుగూడ చాల వ్యయకారణమై ప్రభుత్వమునకు ఆదాయ కారణమై వివాదలను పెంచినదని సర్ జేమ్సు కెయిర్డు వ్రాసినాడు. పాతపద్ధతులుపోయి ఆంగ్లేయకోర్టులను స్థాపించుట హెచ్చినకొలది దేశములో అబద్ద సాక్ష్యములును, అందువలన న్యాయపరిపాలనములో కలుగు ఘోరఅన్యాయములు, వర్దిల్లినవని చరిత్రకారులు వ్రాయుచున్నారని పార్లమెంటు మెంబరగు జాన్‌బ్రైట్ ఉపన్యసించెను. (Speeches. Vol II, P. 202) మరాటీదండయాత్రలకన్నను తండోపతండములుగా పెరుగుచున్న ఈ ఆంగ్లేయ న్యాయవాదులు రాష్ట్రప్రజలకు దిగ్భ్రమ కలిగించుచున్నారని మెకాలే వ్రాసినాడు. పదునెనిమిదవ శతాబ్దిలో నింగ్లీషు కోర్టులు విధించిన శిక్ష లతిక్రూరములై యుండెను. అనేకభారతీయులను చచ్చువరకు కొరడాలతో బాదవలసినదని శిక్షవిధించినట్లు రికార్డులుకలవు, ఆంగ్లేయ ఆఫీసర్ల కౌన్సిలువా రొకమనిషిని చచ్చువరకు గుఱ్ఱముచే నీడ్పించునట్లు శిక్షవిధించిరనియు నిదర్శనముకలదని. రెజినాల్డు రేనాల్డ్సు 'న్యూలీడరులో' వ్రాసినాడు. ( మే 1938).
బ్రిటిషువా రీదేశమున స్థాపించిన న్యాయపరిపాలనా పద్ధతి ప్రజలప్రాణములకును ఆస్తికిని శాంతిభద్రతలనొడగూర్చు నట్టిదికాదు. జూదరితనమును, దుర్మార్గమును పెంపొందించు నట్టిదిగా నున్నది. ఈ న్యాయపరిపాలనా పద్ధతియు దీని ఆచరణమును లోప భూయిష్టముగ నుండెను. గవర్నరుజనరల్‌గ నుండిన మార్క్విస్ ఆఫ్ హేస్టింగ్సు 1819 ఫిబ్రవరిలో వ్రాసిన