Jump to content

పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/106

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

82

భారత దేశమున


దుర్మార్గులనియు కంపెనీ కొలువులోని ఆంగ్లేయోద్యోగులు తప్ప భారతీయులు పరిపాలక ఉద్యోగములకు తగరనియు పలుక సాహసించుచున్నాము!"

“నాగరకత కలిగినట్టియు, జనాకీర్ణమైనట్టియు ఈభారతదేశములో న్యాయపరిపాలనము భారతీయుల మూలముననే జరుగవలెను. ఐరోపా ప్రభుత్వములు చేయుచున్నట్లుగానే ప్రజా సేవలో తగు జీతములను గౌరవములను ప్రసాదించి ప్రజలనైతికధర్మములను కాపాడపలెను” అని సర్ తామస్ మన్రో 1820లోనే చెప్పియున్నాడు. కాని యిది జరుగలేదు.

|||

పూర్వపు పంచాయతీల వినాశము

బ్రిటిషువారీ దేశము నాక్రమించినది మొదలు దేశపరిపాలనకు సంబంధించిన పెద్ద యుద్యోగములు భారతీయుల కివ్వకపోవుటయే గాక సర్వాధికారములను తెల్లయుద్యోగుల చేతులలో పెట్టుకొనవలెనను ఉద్దేశము ననుసరించి భారత దేశప్రజల కనాదిసిద్ధముగా నుండిన స్థానిక స్వపరిపాలన సంస్థలగు గ్రామపంచాయితీలను కూడా నాశనము చేయసాగిరి. దీనివలన భారతీయులకు కలిగిన ఘోరఅన్యాయము వర్ణనాతీతము. దీనివలన ప్రజలలో స్వాతంత్ర్యశక్తులు నశించి వారు నోరులేని పశువులమందల స్థితికి దిగిపోయిరి. ఆంగ్లరాజ్య ప్రారంభ దినములలో భారతదేశమునకు గవర్నరుజనరలుగా నుండిన కార౯ వాలీసుయొక్క జీవితచరిత్రను వ్రాసిన సర్ తామస్