Jump to content

పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/104

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

80

భారత దేశమున


దనియు అన్ని యుద్యోగములు తెల్లవారికే యివ్వవలెననియు నొక పద్దతి స్థిరపడినది. శిస్తు వసూలులో నల్లకలెక్టర్లు తీసివేయబడి తెల్లవారు నియమింపబడిరి. నల్లయుద్యోగుల ఫైన తెల్లయుద్యోగులను పై యధికారులుగా పెట్టిరి. పరిపాలనకు సంబంధించినట్టియు, పెద్దజీతములు గలట్టియు ఏ యుద్యోగములుకూడ నల్లవారి కొసగకపోయిరి. న్యాయవిచారణ నల్లవారి చేతులనుండి తీసివేసి తెల్లజడ్జీల కొసగిరి. 1817 లో మద్రాసు గవర్నరు నాటి గవర్నరుజనరలగు హేస్టింగ్సున కిట్లు వ్రాసినాడు." బ్రిటిషువారు తమ పశుబలమువలన తిరుగుబాటులను అణచివేయగలరు. విదేశీయ దండయాత్రలను నిరోధింతురు. తమ ప్రజలకు రక్షణ నివ్వగలుగుదురు. వారి శాసనధర్మములు సంస్థలుకూడ ప్రజాపీడన తొలగించి శాంతిభద్రతలను పూర్తిగా స్థాపించునట్టివిగానే యున్నవి. గాని ప్రజలస్థితి మాత్రము పూర్వరాజులకాలమునాటికన్న బాగుపడినట్లు చెప్పజాలము. ఈ శాంతిభద్రతలు రక్షణయు పారతంత్ర్యముతో స్వతంత్రవినాశనముతో స్థాపింపబడినవి. ప్రజలనైతిక ధర్మములు అడుగంటినవి. వారి ఆత్మగౌరవము నశించినది. ఈ ప్రజలు ఏ వ్యాపారమునో, ఏ వృత్తినో జేసికొనుచు అణగియుండవలయునే గాని పరిపాలనములో వీ రెట్టి పలుకుబడిని కోరుటకు వీలులేదు. శాససనిర్మాణములోను, సివిలు పాలనములోను వీరు పాల్గొన వీలులేదు.

ప్రజాసేవకులు ప్రభుత్వ ఉద్యోగములు సేయువారు, అట్టి అర్హత దర్జాగలవారును ఉన్ననే ప్రజల నీతిధర్మములు